స్టాక్ మార్కెట్లకు గుజరాత్ ఫలితాల జోష్
2019 ఎన్నికలకు ప్రీఫైనల్ లాగా భావిస్తున్న గుజరాత్ ఎన్నికల్లో భాజపా విజయం స్టాక్ మార్కెట్లకు జోష్ నిచ్చింది. ఒక పక్క గుజరాత్ అభివృద్ది మంత్రం పనిచేయడంతో పాటు, మరో వైపు ఎన్డీఏ ప్రభుత్వం చేప
2019 ఎన్నికలకు ప్రీఫైనల్ లాగా భావిస్తున్న గుజరాత్ ఎన్నికల్లో భాజపా విజయం స్టాక్ మార్కెట్లకు జోష్ నిచ్చింది. ఒక పక్క గుజరాత్ అభివృద్ది మంత్రం పనిచేయడంతో పాటు, మరో వైపు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్న సంకేతాలు బలంగా వెల్లడంతో భాజపా విజయం ఖాయమైంది. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. మొదట 650 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ తర్వాత నెమ్మదిగా కోలుకుంది. భాజపా వైపు ఆధిక్యం స్పష్టంగా వచ్చినప్పటి నుంచీ ఏ దశలోనూ మార్కెట్లు వెనుదిరిగి చూడలేదు. దీంతో మార్కెట్లు ముగిసే సరికి సెన్సెక్స్ 139 పాయింట్ల లాభంతో 33,602 వద్ద ముగియగా మరో సూచీ నిఫ్టీ 56 పాయింట్లు పుంజుకుని 10,389 వద్ద స్థిరపడింది.
ఎన్ఎస్ఈలో దాదాపు అన్ని రంగాలు బలపఢగా స్థిరాస్తి రంగం మాత్రం స్వల్పంగా(0.5%) క్షీణించింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీ, లోహ రంగం, ఫార్మా, వాహన రంగాలు 1.2 నుంచి 2.4% మేర లాభపడ్డాయి.
నిఫ్టీ దిగ్గజాలలో వేదాంత, హిందాల్కో, ఎం అండ్ ఎం, సిప్లా, సన్ ఫార్మా, ఎస్బీఐ, గెయిల్, ఐసీఐసీఐ, భారతీ, ఏసియన్ పెయింట్స్ 2 నుంచి 4 శాతం మధ్య ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగం(2.38%) నష్టపోగా మరో వైపు టెక్ మహీంద్రా, యెస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, యూపీఎల్, కోల్ ఇండియా, హెచ్‌పీసీఎల్, ఇన్ఫోసిస్, ఐబీ హౌసింగ్, ఐటీసీ, అంబుజా 0.5% నుంచి 1.5% మధ్య నష్టాలకు గురయ్యాయి.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి రంగం, ఎనర్జీ తప్ప అన్ని లాభపడ్డాయి. అందులో ముఖ్యంగా లోహ రంగం(1.83%), ఆటో(1.21%) పుంజుకున్నాయి.


Click it and Unblock the Notifications