200 రూపాయ‌ల‌కు కంపెనీలు ఇస్తున్న 28 రోజుల అప‌రిమితి కాలింగ్

జియో క‌స్ట‌మ‌ర్లు ఎక్కువ‌యిన త‌ర్వాత అన్ని నెట్వ‌ర్క్‌లు అన్‌లిమిటెడ్ కాలింగ్ కోసం ప్ర‌త్యేక ప్యాక్‌ల‌ను తీసుకురాక త‌ప్ప‌లేదు. ఈ నేపథ్యంలో వివిధ మొబైల్ సంస్థ‌ల‌కు సంబంధించి రూ.200 లోపు ఉత్త‌మ రీచార్జ

రిల‌య‌న్స్ జియో రాక త‌ర్వాత టెలికాం రంగంలో అన్‌లిమిటెడ్ కాలింగ్ అనేది చాలా సాధారణ విష‌య‌మై పోయింది. ఇంత‌కు ముందు ఎక్కువ మాట్లాడాలంటే రీచార్జీల కోసం త‌డుముకునే వారు ఇప్పుడు ఎంత సేపైనా మాట్లాడేందుకు వెనుకాడ‌టం లేదు. ముఖ్యంగా జియో క‌స్ట‌మ‌ర్లు ఎక్కువ‌యిన త‌ర్వాత అన్ని నెట్వ‌ర్క్‌లు అన్‌లిమిటెడ్ కాలింగ్ కోసం ప్ర‌త్యేక ప్యాక్‌ల‌ను తీసుకురాక త‌ప్ప‌లేదు. ఈ నేపథ్యంలో వివిధ మొబైల్ సంస్థ‌ల‌కు సంబంధించి రూ.200 లోపు ఉత్త‌మ రీచార్జీ ప్లాన్ల‌ను ఇక్క‌డ చూద్దాం.

 రిల‌య‌న్స్ జియో

రిల‌య‌న్స్ జియో

రిల‌య‌న్స్ జియో అన్నింటి కంటే ఆక‌ర్ష‌ణీయ ధ‌ర‌లో మంచి రీచార్జీ ప్లాన్ను అందిస్తోంది. కేవ‌లం రూ.149కే 28 రోజుల అప‌రిమిత కాలింగ్‌ను ఉచితంగా ఇస్తున్న‌ది. అంతే కాకుండా ప్ర‌తి రోజూ 150 ఎంబీ వ‌ర‌కూ డేటా అద‌నం. ఇంకా 300 స్థానిక‌, ఎస్టీడీ ఎస్ఎంఎస్లు ఉచితం. అన్ని ఆప‌రేట‌ర్ల‌కు ఈ ఎస్ఎంఎస్‌లు పంపుకోవ‌చ్చు.

 ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.199 రీచార్జీకి 1జీబీ డేటా అందిస్తున్న‌ది. ఇందులో 28 రోజుల పాటు అప‌రిమిత కాల్స్ ఉచితం. ఇది కేవ‌లం కొన్ని స‌ర్కిళ్ల‌లోనే ఉంది. అంతే కాకుండా రోమింగ్లో ఇన్‌క‌మింగ్ కాల్స్ ఉచితం. ఇంకా అప‌రిమిత స్థానిక‌, జాతీయ ఎస్ఎంఎస్‌లు ఉచితం.

బీఎస్ఎన్ఎల్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ ప్లాన్ 18 0రోజుల కోసం రూ.186 వ‌సూలు చేస్తున్న‌ది. 1జీబీ డేటా 28 రోజుల పాటు వాడుకోవ‌చ్చు. అప‌రిమిత బీఎస్ఎన్ఎల్; ఇత‌ర నెట్వ‌ర్క్ కాల్స్ ఉచితంగా చేసుకోవ‌చ్చు.

 ఐడియా నెట్వ‌ర్క్‌లో ఇలా

ఐడియా నెట్వ‌ర్క్‌లో ఇలా

ఐడియా రూ.179 కే 28 రోజుల పాటు అప‌రిమిత కాల్స్ ఉండేలా రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది.

ఇందులో 100 స్థానిక ఎస్ఎంఎస్‌లు ఉచితంగా ఇస్తున్నారు. ఐడియా యాప్, ఐడియా వెబ్‌సైట్ ద్వారా కాకుండా ఇత‌ర వాలెట్లు, వెబ్‌సైట్లు, యాప్‌ల్లో రీచార్జీ చేసుకుంటే 21 రోజుల వాలిడిటీతో 1జీబీ డేటాను అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+