గుజరాత్ గెలుపు అంచనా... సెన్సెక్స్ పరుగులు
చివరి వరకూ కొనుగోళ్ల జోరు కొనసాగడంతో మార్కెట్లు చివరికి పటిష్ట లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 216 పాయింట్లు బలపడి 33,246 వద్ద ముగియగా మరో సూచీ నిఫ్టీ 81 పాయ
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భాజపా గెలవనుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మార్కెట్లు ఉరకలెత్తాయి. మోడీ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలకు ప్రజల మద్దతు ఉన్న కారణంగానే రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలవనుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లనుండటంతో మార్కెట్లకు జోష్ వచ్చింది. దీంతో ఉదయం ఆరంభ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్ 300 పాయింట్లు బలపడగా తర్వాత కూడా మార్కెట్లు సానుకూలంగానే సాగాయి. చివరి వరకూ కొనుగోళ్ల జోరు కొనసాగడంతో మార్కెట్లు చివరికి పటిష్ట లాభాలతో ముగిశాయి.

మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 216 పాయింట్లు బలపడి 33,246 వద్ద ముగియగా మరో సూచీ నిఫ్టీ 81 పాయింట్లు పుంజుకొని 10,333 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం అత్యధికంగా 2.63% లాభపడింది. ఇంకా కన్సూమర్ డ్యూరబుల్స్(1.71%), వాహన రంగం(1.38%), మూలధన వస్తువులు(1.11%) లాభపడ్డాయి. టెలికాం రంగ(0.50%) షేర్లు నష్టపోయాయి.

సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఎం అండ్ ఎం(3.27%), బజాజ్ ఆటో(2.81%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(2.06%), అదానీ పోర్ట్స్(1.84%), కోల్ ఇండియా(1.81%) లాభపడిన వాటిలో ముందున్నాయి. మరో వైపు హెచ్‌యూఎల్(0.9%), సిప్లా(0.84%), ఓఎన్‌జీసీ(0.62%), ఎన్టీపీసీ(0.45%), ఏసియన్ పెయింట్స్(0.39%) ఎక్కువగా నష్టపోయాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications