పరిశ్రమలను ప్రోత్సహించినందుకు గ్రామీణ బ్యాంకుకు అవార్డు
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ( ఏపీజీవీబీ).. 2017 సంవత్సరానికి గాను అసోచామ్ నుంచి ఎస్‌ఎంఇ మైక్రో లెండింగ్ ఎక్సలెన్స్ అవార్డును గెలుచుకుంది
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ( ఏపీజీవీబీ).. 2017 సంవత్సరానికి గాను అసోచామ్ నుంచి ఎస్‌ఎంఇ మైక్రో లెండింగ్ ఎక్సలెన్స్ అవార్డును గెలుచుకుంది. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐదవ ఎస్‌ఎంఇ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు ఉదిత్ రాజ్ నుంచి బ్యాంకు జనరల్ మేనేజర్ టివి కృష్ణా రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు ఎస్‌బీఐ మూలధనాన్ని సమకూర్చింది .మొత్తం 5 గ్రామీణ బ్యాంకులను కలిపి ఈ బ్యాంకుగా ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఉన్న శ్రీ వికాస్ గ్రామీణ బ్యాంకు, నాగార్జున గ్రామీణ బ్యాంక్, సంఘమేశ్వర గ్రామీణ బ్యాంక్, మంజీరా గ్రామీణ బ్యాంకు, కాకతీయ గ్రామీణ బ్యాంకు కలిసి ఏపీజీవీబీగా ఏర్పాటయింది. ప్రస్తుతం ఈ బ్యాంకు ఛైర్మన్‌గా వి.నరసి రెడ్డి వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ బ్యాంకుఏపీలో శ్రీకాకుళం,విశాఖపట్నం, విజయనగరం, తెలంగాణలో సంగారెడ్డి, మెదక్, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. బ్యాంకు ప్రధాన కార్యాలయం వరంగల్ జిల్లాలో ఉంది.


Click it and Unblock the Notifications