For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

రోజు మొత్తం లాభ‌, న‌ష్టాల మ‌ధ్య ఊగిస‌లాడిన మార్కెట్లు చివ‌రి అర గంట‌లో కొనుగోళ్ల డిమాండ్‌తో చివ‌ర‌కు లాభాల‌తో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఒక ద‌శ‌లో 33,321 గ‌రిష్ట స్థాయికి వెళ్లింది. మార్కెట్లు ముగ

|

రోజు మొత్తం లాభ‌, న‌ష్టాల మ‌ధ్య ఊగిస‌లాడిన మార్కెట్లు చివ‌రి అర గంట‌లో కొనుగోళ్ల డిమాండ్‌తో చివ‌ర‌కు లాభాల‌తో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఒక ద‌శ‌లో 33,321 గ‌రిష్ట స్థాయికి వెళ్లింది. మార్కెట్లు ముగిసే స‌రికి 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 194 పాయింట్లు బ‌ల‌ప‌డి 32,246 వ‌ద్ద ముగియ‌గా మ‌రో సూచీ నిఫ్టీ 59 పాయింట్లు పుంజుకొని 10,252 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

లాభాల్లో మార్కెట్లు

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే చ‌మురు,స‌హజ వాయు(0.99%), ఎఫ్ఎంసీజీ(0.69%), బ్యాంకింగ్(0.67%), హెల్త్ కేర్‌(0.63%) లాభ‌ప‌డ్డాయి. మ‌రో వైపు క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(0.61%), మౌలిక రంగం(0.11%), ఐటీ(0.04%) న‌ష్ట‌పోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డ్డ‌, న‌ష్ట‌పోయిన కంప‌నీల వివ‌రాలు ఇలా ఉన్నాయి.
లాభ‌ప‌డిన వాటిలో డాక్ట‌ర్ రెడ్డీస్(2.34%), సిప్లా(2.22%), ఐటీసీ(1.87%), ఎం అండ్ ఎం(1.36%), యాక్సిస్ బ్యాంక్(1.24%), లుపిన్(1.00%) ముందున్నాయి.
మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో టీసీఎస్(2.62%), స‌న్ ఫార్మా(0.48%), ప‌వ‌ర్ గ్రిడ్(0.37%), ఎల్ అండ్ టీ(0.01%) ఉన్నాయి.

గుజ‌రాత్ ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్స్ నేటి సాయంత్రానికి వెలువ‌డుతుండ‌టంతో పాటు ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ బ్యాంక్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచ‌డంతో ఇన్వెస్ట‌ర్లు ఇవాల్టి ట్రేడింగ్లో కాస్త అప్ర‌మ‌త్త‌త పాటించారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఇక్క‌డ గుజ‌రాత్లో గెలుపుతో 2019 ఎన్నిక‌ల‌కు భ‌విష్య‌త్ బాట సులువు అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ది.

English summary

లాభాల‌తో ముగిసిన మార్కెట్లు | sensex raised by 194 points

The 30-share BSE Sensex bounced back in the last one hour of the session to hit a high of 33,321.52 before closing up 193.66 points -- or 0.59 per cent -- at 33,246.70. The gauge had lost 402.75 points in the previous two sessions due to grim economic data and the lowering of economic growth forecast by the Asian Development Bank.
Story first published: Thursday, December 14, 2017, 16:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X