ఈ సర్వే ద్వారా ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు బిట్ కాయిన్ ట్రేడింగ్ జరుపుతున్న కొంత మంది శ్రీమంతులకు చెందిన లక్షల కొద్దీ లావాదేవీలను సేకరించినట్లు తెలుస్తోంది. నల్లధనాన్ని దాచేందుకు చాలా
బిట్ కాయిన్లకు సంబంధించి గత కొన్ని రోజులుగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా దానికి సంబంధించిన వారు ఉలిక్కిపడేలా దేశం మొత్తం మీద ఉన్న బిట్ కాయిన్ ఎక్స్చేంజీలపై ఐటీ శాఖ దాడులు జరిపింది. పన్ను ఎగవేసి దాన్ని మరో మార్గంలో దాచే వారిని పట్టుకోవాలనే నెపంతో ఈ సర్వే ద్వారా ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు బిట్ కాయిన్ ట్రేడింగ్ జరుపుతున్న కొంత మంది శ్రీమంతులకు చెందిన లక్షల కొద్దీ లావాదేవీలను సేకరించినట్లు తెలుస్తోంది. నల్లధనాన్ని దాచేందుకు చాలా మంది బిట్ కాయిన్లను ఎంచుకున్నారన్న సమాచారంతో ఐటీ అధికార గణం దేశవ్యాప్తంగా ఉన్న 9 ప్రదాన బిట్ కాయిన్ ఎక్స్చేంజీలలో విచారణ నిర్వహించింది.
సోదాల ద్వారా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా బిట్ కాయిన్ ట్రేడింగ్ ద్వారా వచ్చిన లాభాలపై పన్ను ఎగవేసిన వివరాలు బయటకొచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బెంగుళూరు విభాగం పర్యవేక్షణలో పలు దర్యాప్తు బృందాలు బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, గురుగ్రామ్, ఘజియాబాద్, పుణె తదితర ప్రాంతాల్లోని 9 ప్రధాన ఎక్స్చేంజీల్లో తమ సోదాలను చేశాయి.

ప్రాథమిక సమాచారం మేరకు 20-25 లక్షల వరకూ హెచ్ఎన్ఐల సమాచారం లభ్యమైంది. వీటిలో 8-10 లక్షల సంస్థలు లావాదేవీల పరంగా చురుగ్గా ఉన్నట్లు తెలిసింది. అయితే, బుధవారం తనిఖీలు కొనసాగాయి. విచారణ పూర్తైతే గానీ, పూర్తి వివరాలపై స్పష్టత రాదని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. కాగా బిట్ కాయిన్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చర్యలు మొదలుపెట్టడం ఇదే తొలిసారి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications