విరాట్ కోహ్లి-అనుష్క శ‌ర్మ రూ.1000 కోట్లా...

వారిద్ద‌రు క‌లిస్తే సంపాద‌న ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరుగుతుంద‌ని బ్రాండ్ అధ్య‌య‌న సంస్థ‌లు బేరీజు వేస్తున్నాయి. వారి ఉమ్మ‌డి ఆస్తులు, సంప‌ద గురించి వివ‌రంగా తెలుసుకుందాం.

విరాట్ కోహ్లి-అనుష్క పెళ్లి చేసుకున్నారు. దీంతో భార‌త‌దేశంలోనే శ్రీ‌మంతులైన జంట‌గా వీరిని చెప్పుకోవ‌చ్చు. డిసెంబ‌రు 11న ఇటలీలో ప్రైవేటుగా వీరి వివాహం అట్ట‌హాసంగా జ‌రిగింది. వారి పెళ్లి గురించి ఎన్నో వదంతులు చెల‌రేగినా ఈ మ‌ధ్య వారి పెళ్లయింది. దాని గురించి పెద్ద‌గా మీడియాకు తెలియ‌కుండా చేశారు. చివ‌ర‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో దంప‌తులు షేర్ చేసిన ఫోటోల ఆధారంగా వారి వివాహం పూర్త‌యిన‌ట్లు తెలిసి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రు క‌లిస్తే సంపాద‌న ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరుగుతుంద‌ని బ్రాండ్ అధ్య‌య‌న సంస్థ‌లు బేరీజు వేస్తున్నాయి. వారి ఉమ్మ‌డి ఆస్తులు, సంప‌ద గురించి వివ‌రంగా తెలుసుకుందాం.

1. ఇక ఇద్ద‌రు క‌లిస్తే డ‌బ్బులే డ‌బ్బులు

1. ఇక ఇద్ద‌రు క‌లిస్తే డ‌బ్బులే డ‌బ్బులు

బాలీవుడ్, క్రికెట్ అనేవి భార‌త్‌లో ఎప్పుడు హాట్ టాపిక్‌లే. ఇందులో చాలా డ‌బ్బు వ్యాపారం జ‌రుగుతుంది. దీంతో ఇప్పుడు ఈ ఇద్ద‌రి జంట క‌లిస్తే మ‌రెంత వీరి సంపాద‌న పెరుగుతుందోన‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో వీరిద్దరు క‌లిస్తే అటు ఉత్ప‌త్తుల‌కు కావాల్సిన ప్ర‌చారం దొరుకుతుంది .ఇంకా వారిద్ద‌రికి ఇచ్చే డ‌బ్బు సైతం చాలా ఉంటుంది.

 2. కోహ్లి సంపాద‌న ఇదీ

2. కోహ్లి సంపాద‌న ఇదీ

కోహ్లి ప్ర‌స్తుతం ప్ర‌తి సంవ‌త్స‌రం రూ.121 కోట్లు సంపాదిస్తున్నాడు. బీసీసీఐ జాబితాలో ఏ ప్లేయ‌ర్‌గా ఉన్న కోహ్లి ఒక్కో మ్యాచ్‌కు రూ.3ల‌క్ష‌ల వ‌ర‌కూ తీసుకుంటాడు. అదే ఐపీఎల్ సీజ‌న్లో దాదాపు రూ.14 కోట్లు వ‌స్తుంది. అంతే కాకుండా ఐపీఎల్ అత్య‌ధిక పారితోష‌కం అందుకునే క్రికెటర్ల‌లో మొద‌టి వ‌రుస‌లో ఉన్నాడు. కోహ్లి మొత్తం నిక‌ర ఆస్తుల విలువ రూ.382 కోట్లుగా ఉంది.

3. కోహ్లి ఆస్తుల్లో కొన్ని

3. కోహ్లి ఆస్తుల్లో కొన్ని

బీసీసీఐ త‌ర‌పున భార‌త్ ఆడుతున్న క్రికెట్ జ‌ట్టుకు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లి ఇప్ప‌టికే 6 విలాస‌వంత‌మైన కార్లు క‌లిగి ఉన్నాడు. వాటి మొత్తం విలువ రూ.9 కోట్లుగా ఉంది. కోహ్లి బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ల కోసం ఇప్ప‌టికే రూ.16 కోట్లు తీసుకున్నాడ‌ని వివిధ ఏజెన్సీల ద్వారా తెలుస్తోంది.

4. కోహ్లి వివిధ మ్యాచ్‌ల‌కు తీసుకునే డ‌బ్బు ఇలా..

4. కోహ్లి వివిధ మ్యాచ్‌ల‌కు తీసుకునే డ‌బ్బు ఇలా..

కోహ్లి వన్‌డే మ్యాచ్‌ల్లో ఆడేందుకు తీసుకునే మొత్తం రూ. 3 ల‌క్ష‌లు ఒక్కో మ్యాచ్ కోసం.

కోహ్లి టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడేందుకు తీసుకునే మొత్తం రూ. 5 ల‌క్ష‌లు ఒక్కో మ్యాచ్ కోసం.

టీ 20 క్రికెట్ మ్యాచ్‌లో ఆడేందుకు అత‌ను తీసుకునే డ‌బ్బు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఒక్కో మ్యాచ్‌కు

5. అనుష్క శ‌ర్మ‌

5. అనుష్క శ‌ర్మ‌

అనుష్క శ‌ర్మ ఆడ‌వాళ్ల ఫెయిర్ నెస్ అడ్వ‌ర్టైజ్మెంట్లు, అంతే కాకుండా అంద‌రికీ సంబంధించిన వివిధ ఉత్ప‌త్తుల‌కు సంబంధించి చాలా డిమాండ్ ఉన్న బాలీవుడ్ నాయ‌కిగా ఉంది. ఆమె బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ల‌కే రూ.4 కోట్ల వ‌ర‌కూ తీసుకుంటోంది. ఇంకా సినిమాల విష‌యానికి వ‌స్తే ఒక్కో సినిమాలో న‌టించేందుకు ఆమె రూ.10 కోట్ల వ‌ర‌కూ తీసుకుంటుంద‌ని వినికిడి.

అనుష్క మొత్తం ఆస్తి విలువ రూ.220 కోట్ల వ‌ర‌కూ ఉండొచ్చ‌ని బిజినెస్ వ‌రల్డ్ రూపొందించిన వీడియో ద్వారా తెలుస్తోంది.

6. ఫోర్బ్ష్ జాబితా ప్ర‌స్తావ‌న‌

6. ఫోర్బ్ష్ జాబితా ప్ర‌స్తావ‌న‌

ఈ మ‌ధ్యే ఫోర్బ్స్ అత్య‌ధిక ధ‌న‌వంతులైన క్రీడాకారుల జాబితా విడుద‌ల చేసింది. అందులో ఫుట్ బాల్ ఆట‌గాడు లియోన‌ల్ మెస్సీ కంటే ముందు విరాట్ కోహ్లి ఉన్నాడు. ఫోర్బ్స్ లెక్క‌ల ప్ర‌కారం కోహ్లి సంపాద‌న 14.5 మిలియ‌న్ డాల‌ర్లు. వ‌చ్చే కొన్నేళ్ల‌లో విరాట్ నిక‌ర ఆస్తులు 140% పెర‌గొచ్చ‌ని ఫినాప్ నివేదిక అంచ‌నా వేసింది.

7. ఇండియాలో ప్ర‌క‌ట‌న‌ల ద్వారా వీరికి డ‌బ్బే డ‌బ్బు

7. ఇండియాలో ప్ర‌క‌ట‌న‌ల ద్వారా వీరికి డ‌బ్బే డ‌బ్బు

విరాట్ కోహ్లి కేవ‌లం ఆట‌లోనే కాదు యాడ్‌ల కోసం చాలా డిమాండ్ ఉన్న వ్య‌క్తి.

మ‌రో వైపు అనుష్క శ‌ర్మ మంచి న‌టి. ఆమె ఎప్పుడూ ప్రియాంక చోప్రా, దీపికా ప‌దుకొణె, క‌త్రినాల‌తో పోటీ ఎదుర్కొన‌లేదు.

త‌న‌దైన ప్ర‌తిభ‌, అభిన‌యంతో సినిమా అవ‌కాశాలు తెచ్చుకుంటూ త‌న కెరీర్‌ను వెల్ల‌దీస్తున్నారు

ఇద్ద‌రూ క‌లిసి కేవ‌లం బ్రాండ్ల‌నే ముందుకు తీసుకెళ్ల‌డం లేదు, దేశ విదేశాల్లో ఇండియాకే బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌య్యారు.

 8. వీరు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బ్రాండ్లు

8. వీరు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బ్రాండ్లు

ఇప్పుడున్న నివేదిక‌ల ప్ర‌కారం ఇద్ద‌రూ క‌లిసి 28 బ్రాండ్ల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

అందులో హెడ్ అండ్ షోల్డ‌ర్స్, మాన్య‌వ‌ర్‌, పెప్సీ, సెల్‌కాన్, బూస్ట్‌, ఆడీ, ఫాస్ట్ ట్రాక్, జియోని,Wrogn, పోలారాయిడ్ వంటి ఉత్ప‌త్తుల‌కు ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌క‌టన‌లిస్తున్నారు.

9. ఒక్కొక్క‌రు అలా, ఇద్ద‌రు ఇలా.

9. ఒక్కొక్క‌రు అలా, ఇద్ద‌రు ఇలా.

ఫినాప్ నివేదిక ప్ర‌కారం ఇద్దరి ఆస్తులు ఇలా ఉన్నాయి.

విరాట్ కోహ్లి నిక‌ర సంప‌ద 60 మిలియన్ డాల‌ర్లు, అంటే రూ.382 కోట్లు.

అనుష్క శ‌ర్మనిక‌ర సంప‌ద 35 మిలియ‌న్ డాల‌ర్లు, అంటే రూ.220 కోట్లు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+