175 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ట్రేడింగ్ ఆరంభం నుంచి లాభ,నష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు చివరకు ప్రతికూలంగా ముగిశాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదు కావడం, పారిశ్రామికోత్పత్తి మందగించడం, ఫెడ్ పాలసీ నిర్ణయాలు ఎల
ట్రేడింగ్ ఆరంభం నుంచి లాభ,నష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు చివరకు ప్రతికూలంగా ముగిశాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదు కావడం, పారిశ్రామికోత్పత్తి మందగించడం, ఫెడ్ పాలసీ నిర్ణయాలు ఎలా ఉంటాయన్న ఆందోళన నేపథ్యంలో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. మిడ్ సెషన్ నుంచి తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. దీంతో మార్కెట్లు ముగిసే సరికి సెన్సెక్స్ 175 పాయింట్లు క్షీణించి 33,053 వద్ద ముగియగా మరో వైపు నిఫ్టీ 47 పాయింట్లు క్షీణించి 10,193 వద్ద స్థిరపడింది.

ఎన్ఎస్ఈలో దాదాపు అన్ని రంగాలు నష్టపోగా... స్థిరాస్తి, పీఎస్‌యూ బ్యాంకింగ్, లోహ, ఫార్మా రంగాలు 1.3 నుంచి 2.2 శాతం మధ్య నష్టపోయాయి. ఎఫ్పీఐల నికర కొనుగోళ్లు రూ. 843.20 కోట్లుగా ఉన్నాయి. అదే దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.853.67 కోట్ల మేర ఈక్విటీలను అమ్మకానికి పెట్టారు.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన కంపెనీల షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి. కొటక్ బ్యాంక్(1.43%), టీసీఎస్(0.68%), ఓఎన్‌జీసీ(0.44%), డాక్టర్ రెడ్డీస్(0.23%), హిందూస్థాన్(0.12%) మాత్రమే లాభపడిన వాటిలో ఉన్నాయి.
నష్టపోయిన వాటిలో సిప్లా(2.13%), అదానీ పోర్ట్స్(1.97%), ఎస్బీఐఎన్(1.62%), ఐసీఐసీఐ బ్యాంక్(1.42%),భారతీ ఎయిర్టెల్(1.34%), ఎల్ అండ్ టీ(1.15%), టాటా స్టీల్(1.03%) ముందున్నాయి.


Click it and Unblock the Notifications