For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తుది గ‌డువు రేపే: బ‌్యాంకులు 28 కంపెనీల విష‌యంలో ఏం చేస్తాయో...

వీడియోకాన్, జేపీ అసోసియేట్ స‌హా 28 పెద్ద కంపెనీలు బ్యాంకుల‌కు ఎగ‌వేసిన రుణాల వ‌సూళ్ల ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశారు. ఆర్బీఐ ఒక మార్గ సూచీ ప్ర‌కారం మొండి బ‌కాయిల ప్ర‌క్రియ‌ను ముందుకు తీసుకెళుతోంది.

|

వీడియోకాన్, జేపీ అసోసియేట్ స‌హా 28 పెద్ద కంపెనీలు బ్యాంకుల‌కు ఎగ‌వేసిన రుణాల వ‌సూళ్ల ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశారు. ఆర్బీఐ ఒక మార్గ సూచీ ప్ర‌కారం మొండి బ‌కాయిల ప్ర‌క్రియ‌ను ముందుకు తీసుకెళుతోంది. మొద‌టి ద‌ఫా గ‌తంలో 11 కంపెనీల జాబితాను వెలువ‌రించిన ఆర్బీఐ ప్ర‌స్తుతం 28 కంపెనీల మొండి ప‌ద్దుల‌కు సంబంధించి రుణ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ గడువును డిసెంబ‌రు 13గా నిర్ణ‌యించింది. దీంతో బ్యాంక‌ర్ల‌లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. ఒక‌వేళ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించకున్నా, లేక వ‌సూలు కాక‌పోయినా జాతీయ కంపెనీ చ‌ట్టాల ట్రిబ్యున‌ల్(ఎన్సీఎల్‌టీ)లో కేసులు దాఖ‌లు చేయాల‌ని కేంద్ర బ్యాంకు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రూ.2 ల‌క్ష‌ల కోట్ల మేర కేవ‌లం 28 సంస్థ‌లే బ్యాంకుల‌కు బ‌కాయి ప‌డ్డాయి.

 28 సంస్థ‌ల‌పై దివాలా కేసులు

వీటిని వ‌సూలు చేసే ప్ర‌క్రియ‌లో భాగంగా అన్ని మార్గాల‌ను ఆర్బీఐ అన్వేషించింది. ఈ బ‌కాయిల వ్య‌వ‌హారం ఎన్‌సీఎల్టీ కేసుల వ‌ర‌కూ పోకుండా అన్ని విధాల బ్యాంకులు త‌మ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. మ‌రో 24 గంట‌ల్లో గ‌డువు ముగుస్తున్నందున బ్యాంకింగ్ రంగంలో కాస్త ఆందోళ‌న క‌నిపిస్తోంది. గ‌తంలో 11 కంపెనీల జాబితాలో నాగార్జున ఆయిల్ రిఫైన‌రీ, ఉత్త‌మ్ గ‌ల్వా మెటాలిక్స్‌, ఆర్చిడ్ ఫార్మా, రుచి సోయా, యునిటీ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ వంటివి ప్ర‌స్తుతం ఇన్ సాల్వెన్సీ చ‌ట్టం ప్ర‌కారం కోర్టు విచార‌ణ ప్ర‌క్రియ‌లో ఉన్నాయి. ఇంకా ఏసియ‌న్ క‌ల‌ర్ కోటెడ్, ఐవీఆర్ సీఎల్, శ‌క్తి భోగ్, వీడియోకాన్ టెలికాం, ఎస్సార్ ప్రాజెక్ట్స్ వంటివి సైతం జాతీయ కంపెనీల చ‌ట్టం ట్రిబ్యున‌ల్ విచార‌ణ‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని సీనియ‌ర్ బ్యాంక‌ర్లు అంచ‌నా వేస్తున్నారు.
ప్ర‌స్తుతం ఆర్బీఐ రెండో జాబితాలో ఉన్న 28 కంపెనీలు బ్యాంకుల‌కు క‌ట్ట‌కుండా ఉన్న అప్పుల మొత్తం రూ.2.4 ల‌క్ష‌ల కోట్లు.
అందులో ప్ర‌ముఖ‌మైన‌వి
వీడియోకాన్- రూ. 45,000 కోట్లు
జయ‌ప్ర‌కాష్ అసోసియేట్స్ - రూ. 26,000 కోట్లు
ఐవీఆర్‌సీఎల్ - రూ.10,107కోట్లు
ఉత్త‌మ్ గాల్వా స్టీల్స్- రూ. 4150 కోట్లు
సోమా ఎంట‌ర్ ప్రైజెస్- రూ. 1895 కోట్లు
ఏసియ‌న్ క‌ల‌ర్ కోటెడ్- రూ.3019 కోట్లు

Read more about: banks rbi banking
English summary

తుది గ‌డువు రేపే: బ‌్యాంకులు 28 కంపెనీల విష‌యంలో ఏం చేస్తాయో... | Insolvency proceeding deadline for 28 companies is December 13th

Bankers are looking to speed up the resolution of 28 accounts including Videocon Industries, Jaiprakash Associates and Uttam Galva Steel as a December 13 deadline looms. These companies are part of the Reserve Bank of India's second list of defaulters to be referred to bankruptcy proceedings for recovery of more than Rs 2 lakh crore.
Story first published: Tuesday, December 12, 2017, 17:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X