For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

300 పాయింట్ల‌కు పైగా లాభ‌ప‌డ్డ సెన్సెక్స్

అంత‌ర్జాతీయంగా సానుకూల ప‌రిణామాల‌తో పాటు, మ‌దుప‌ర్లు కొనుగోళ్ల‌కు మొగ్గుచూప‌డంతో మార్కెట్లు లాభాల్లో ప‌య‌నించాయి. మార్కెట్లు ముగిసే స‌రికి సెన్సెక్స్ 301.09 పాయింట్ల లాభంతో 33,250 వ‌ద్ద ముగిసింది.

|

అంత‌ర్జాతీయంగా సానుకూల ప‌రిణామాల‌తో పాటు, మ‌దుప‌ర్లు కొనుగోళ్ల‌కు మొగ్గుచూప‌డంతో మార్కెట్లు లాభాల్లో ప‌య‌నించాయి. మార్కెట్లు ముగిసే స‌రికి సెన్సెక్స్ 301.09 పాయింట్ల లాభంతో 33,250 వ‌ద్ద ముగిసింది. మ‌రో సూచీ నిఫ్టీ 99 పాయింట్లు పుంజుకుని 10266 వ‌ద్ద స్థిర‌ప‌డింది.
రంగాల వారీగా చూస్తే చ‌మురు, బ్యాంకింగ్‌, ఫార్మా రంగాల షేర్లు లాభాల్లో ప‌య‌నించాయి. నిఫ్టీ బ్యాంకింగ్ రంగ సూచీ 25,321 స్థాయికి చేరింది. నిఫ్టీ ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సూచీ మాత్రం 0.83% ప‌డింది.

 లాభాల్లో మార్కెట్లు

బీఎస్ఈ సూచీలో చూస్తే ఎఫ్ఎంసీజీ(2.13%), హెల్త్ కేర్(1.42%), ప్రాథ‌మిక వ‌స్తువులు(1.21%), చ‌మురు స‌హ‌జ వాయు(1.15%), లోహం(1.12%) లాభాల్లో ప‌య‌నించాయి.

నిఫ్టీ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో హెచ్‌పీసీఎల్(3.72%), ఐటీసీ(3.6%), ఐవోసీ(3.5%), బీపీసీఎల్(3.02%), స‌న్ ఫార్మా(2.67%) ఉన్నాయి. మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో ఇన్‌ఫ్రాటెల్(2.28%), గెయిల్(1.74%), జీ ఎంట‌ర్ ప్రైజెస్(1.54%), రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్(1.10%), ఎస్‌బీఐ(1.01%) ఉన్నాయి.

గ‌త మూడు రోజుల్లో న‌గ‌దు విభాగంలో రూ.3000 కోట్ల విలువైన షేర్ల‌ను విక్ర‌యించిన విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట‌ర్లు(ఎఫ్‌పీఐలు) గురువారం రూ.1067 కోట్ల పెట్టుబ‌డుల‌ను వెన‌క్కు తీసుకున్నారు. ఇదే స‌మ‌యంలో రూ. 2800 కోట్ల‌ను ఇన్వెస్ట్ చేసిన దేశీ ఫండ్స్(డీఐఐ)లు గురువారం మ‌రోసారి రూ.927 కోట్ల విలువైన కంపెనీ షేర్ల‌ను కొనుగోలు చేశాయి.

English summary

300 పాయింట్ల‌కు పైగా లాభ‌ప‌డ్డ సెన్సెక్స్ | sensex gained over 300 points ahead of Gujarat elections

The 30-share BSE Sensex opened on a strong footing at 33,034.20 and maintained its upward trend to hit the day’s high of 33,285.68 before ending at 33,250.30, up 301.09 points, or 0.91 per cent. The index had rallied 352.03 points in the previous session on value-buying by investors in recently-battered blue-chip stocks.
Story first published: Friday, December 8, 2017, 17:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X