రూ.1649కే ఎయిర్‌టెల్ 4జీ ఫోన్
దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ చౌకధరలో 4జీ ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ భాగస్వామ్యంతో చౌక ధరలో 4జి స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేస్తోంద
దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ చౌకధరలో 4జీ ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ భాగస్వామ్యంతో చౌక ధరలో 4జి స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేస్తోంది. జియోకి పోటిగా రూ.1649కే ఆక్వా లయన్స్ ఎన్1 పేరితో దీన్ని ఆవిష్కరించింది. దీంతో పాటు మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లను కూడా తీసుకొచ్చింది.

వీటిలో ఆక్వా ఎ4 మార్కెట్ ధర రూ.4999 కాగా రూ.1999లకే అందిస్తున్నట్లు తెలిపింది. ఆక్వా ఎస్3 మార్కెట్ ధర రూ.6,649 ఉండగా రూ.4,379కే వియ్రిస్తున్నట్లు వెల్లడించింది. అక్వా లయన్స ఎన్1 కోసం డౌన్‌పేమెంట్ కింద ఈ ఫోన్‌కు రూ.3,149 చెల్లించాల్సి ఉంటుంది. క్యాష్ బ్యాక్ కింద రూ.1500 అందించనుంది. రీఫండ్ పొందాలంటే నెలకు రూ.169 రీఛార్జి చొప్పున 36నెలల పాటు చేయించాల్సి ఉంటుందని షరతు విధించింది.
మొత్తం మీద జియో లాగే ఇది సైతం వింతైన షరతులతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 1జీబీ ర్యామ్, 8జీబీ సామర్థ్యం, 2ఎంపీ రేర్ కెమెరా, వీజీఏ సెల్ఫీ కెమెరా, డ్యూయల్ సిమ్ ఫీచర్లు ఉన్న ఈ చౌక ఫోన్ కోసం మొదట రూ.3149 చెల్లించాలి. అయితే ఈ ఫోన్ 18 నెలలు వాడితే రూ.500, 36 నెలలు వాడితే మరో రూ.1000 ఈ విధంగా మొత్తం రూ.1500 వెనక్కు ఇచ్చేలా ప్రణాళిక రచించారు.


Click it and Unblock the Notifications