ఆర్బీఐ నిర్ణయం: సెన్సెక్స్ 206 పాయింట్లు డౌన్
ఆర్‌బీఐ రేట్ల కోతకు మొగ్గుచూపకపోవడంతో ఈ రోజు దేశీయ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 206 పాయింట్లు కోల్పోయి 32,597 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 74 పాయింట్లు దిగజారి
ఆర్‌బీఐ రేట్ల కోతకు మొగ్గుచూపకపోవడంతో ఈ రోజు దేశీయ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 206 పాయింట్లు కోల్పోయి 32,597 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 74 పాయింట్లు దిగజారి 10,044 వద్ద స్థిరపడింది.

ఐటీ,టెక్నాలజీ రంగాలు తప్ప బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో అన్ని రంగాలు నష్టాల పాలయ్యాయి. అందులో లోహ రంగం(2.03%), పీఎస్‌యూ(1.32%), బ్యాంకింగ్(1.23%), మౌలిక రంగం(1.15%) నష్టపోయాయి. మరో వైపు ఐటీ రంగం(0.32%), టెక్నాలజీ రంగం(0.03%) లాభపడ్డాయి.
సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన షేర్ల వివరాలు ప్రధానంగా ఇలా ఉన్నాయి. రిలయన్స్ (+ 1.76%), మారుతి (+ 1.42%), హెచ్‌యూఎల్ (+ 1.05%), కోల్ ఇండియా(0.26%), ఇన్ఫోసిస్ (+ 0.61%) లాభపడిన వాటిలో ముందుండగా మరో వైపు సన్్‌ఫార్మా (2.31%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(-2.21%), ఐసిఐసిఐ బ్యాంక్ (-1.96%), హెచ్డీఎఫ్సీ (-1.78%), బజాజ్ ఆటో (-1.65%) ఎక్కువగా నష్టపోయాయి.


Click it and Unblock the Notifications