డిసెంబరు 2న తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు చెప్పింది. వారి కోసం ప్రత్యేకంగా ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
డిసెంబరు 2న తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు చెప్పింది. వారి కోసం ప్రత్యేకంగా ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇలాంటిది నిర్మించడం ప్రపంచంలోనే మొదటిసారని తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా తెలిపింది. వింధ్యా ఈ-ఇన్ఫోమీడియా ప్రైవేటు లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ దివ్యాంగుల ఐటీ పార్క్ వికలాంగుల కొరకు ప్రత్యేక అవకాశాలు కల్పించే దానిపైన దృష్టి సారిస్తుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానశ్రయం సమీపంలో ఐటీ పార్క్ లోపలే దీన్ని అభివృద్ది చేస్తారని తెలుస్తోంది.

వింధ్యా ఈ-ఇన్ఫోమీడియా దివ్యాంగ ఉద్యోగుల్లో ప్రతిభను బయటకు తీసేందుకు, వారికి సరైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. ఈ సంస్థ అటువంటి వారు ఉద్యోగాలు చేసుకునేందుకు అనువుగా వసతులు కల్పించింది. ఈ సంస్థకు హైదరాబాద్, బెంగుళూరులో కార్యకలాపాలు ఉన్నాయి. మొత్తం 1600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కంపెనీలో ఎక్కువ శాతం ఉద్యోగులకు శారీరక లోపం, వినికిడి లోపం, చూపు తక్కువ ఉండటం వంటి లోపాలు కలిగిన వారు ఉంటారు. ఈ కంపెనీ ఎక్కువగా బీఎఫ్ఎస్ఐ, టెలికాం, ఈ-కామర్స్ సంస్థల్లో బీపీవో కార్యకలాపాల సేవలను అందిస్తున్నది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications