నవంబరులో 10 కోట్లు దాటిన యూపీఐ లావాదేవీలు
నవంబరులో ఈ వ్యవస్థ ద్వారా జరిపిన లావాదేవీల సంఖ్య 10 కోట్లను దాటింది. ఆగస్టు నెలలో ఈ వ్యవస్థ ద్వారా 1.66 కోట్ల లావాదేవీలు, సెప్టెంబరులో 3 కోట్లు, అక్టోబర్లో 7.67 కోట్లు జరిగాయి. ఇప్పుడు
ఎన్‌పీసీఐ(భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్) ప్రవేశపెట్టిన యూపీఐ లావాదేవీల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. నవంబరులో ఈ వ్యవస్థ ద్వారా జరిపిన లావాదేవీల సంఖ్య 10 కోట్లను దాటింది. ఆగస్టు నెలలో ఈ వ్యవస్థ ద్వారా 1.66 కోట్ల లావాదేవీలు, సెప్టెంబరులో 3 కోట్లు, అక్టోబర్లో 7.67 కోట్లు జరిగాయి. ఇప్పుడు ఏకంగా 10 కోట్ల మార్కును దాటడం విశేషం.

ఆగస్టు 25,2016లో ప్రారంభమైన యూపీఐ (సొమ్ము బదిలీ విధానం) స్మార్ట్ ఫోన్ల ద్వారా డబ్బును వేగంగా పంపించేందుకు ఆస్కారం కల్పిస్తోంది. మనం మెసేజ్, మెయిల్ పంపినంత సులువుగా ఈ విధానంలో డబ్బును అవతలి వ్యక్తికి పంపవచ్చు. ఎన్‌పీసీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం నవంబరు నెలలో 10.50 కోట్ల లావాదేవీల ద్వారా రూ.9769 కోట్ల సొమ్మును యూపీఐ ఉపయోగించి బ్యాంకు ఖాతాల మధ్య బదిలీ చేశారు. భీమ్ యాప్ ఉపయోగించి జరిపిన లావాదేవీల సంఖ్య తక్కువగానే 8% వద్ద ఉంది. అయితే భీమ్ యాప్ ద్వారా యూపీఐ విధానంలో పంపిన సొమ్ము విలువ మొత్తం యూపీఐ ఆధారిత నగదు బదిలీ విధానంలో 26%గా ఉండటం శుభసూచకం. ఎందుకంటే ప్రభుత్వ యాప్ ద్వారా ప్రజలు డబ్బు పంపడానికి ఆసక్తి చూపుతున్నారు. నవంబరు నెలలో భీమ్ యాప్ వాడకం చెప్పుకోదగ్గ విధంగా పెరిగింది. అక్టోబర్ నెలలో 76.32 లక్షల లావాదేవీలు భీమ్ ఆధారంగా జరగ్గా, నవంబరు నెలకు వచ్చే సరికి అవి 82.13 లక్షలకు పెరిగాయి. అదే డబ్బు విలువ పరంగా చూస్తే అక్టోబర్ నెలలో రూ.2348 కోట్లుగా ఉండగా నవంబరు నెలకు రూ.2533 కోట్లకు పెరిగింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications