జీఎస్టీ పరిధిలోకి పెట్రోలు, డిజీల్‌ను సైతం తీసుకురావాలి
ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌ను జిఎస్టీ పరిధిలోకి తేవాలని, రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని రేతిఫైల్ బస్
జీఎస్టీ తర్వాత చాలా వస్తువుల రేట్లన్నీ పెరిగాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు ఇప్పటి వరకూ స్థిరాస్తి రంగాన్ని, పెట్రోలు,డీజిల్ వంటి ఇంధనాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌ను జిఎస్టీ పరిధిలోకి తేవాలని, రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని రేతిఫైల్ బస్ స్టాండ్ వద్ద ఫెడరేషన్ ఆధ్వర్యంలో లక్ష మంది పౌరులతో సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఏఐటియుసి తెలంగాణ కార్యదర్శి విఎస్ బోస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గినా, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 57 శాతం పన్నులు విధిస్తున్నాయని చెప్పుకొచ్చారు. అదే పెట్రోల్, డీజిల్‌ను జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే వీటి ధర రెండు వంతులు తగ్గుతుందని అన్నారు. అటువంటి నిర్ణయం వాహన చోదకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. డీజిల్ ధరలు భారీగా పెరగడంతో రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయని తెలిపారు. అదే జిఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే పెట్రోల్, డీజిల్ ధర తగ్గి నిత్యావసరాల ధరలు సైతం తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications