For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూపాయి నోటు వ‌చ్చి 100 ఏళ్లయిన సంద‌ర్భంగా 10 విశేషాలు

మొద‌టిసారి కాగిత‌పు ముద్ర‌ణ‌కు నోచుకున్న రూపాయి నోటు ఎన్నో చ‌రిత్రాత్మ‌క ఘ‌ట‌నల‌ను ముద్ర‌ల‌ను త‌న‌లో ఇముడ్చుకుంది. ఎన్నో మ‌రుపురాని ఘ‌ట్టాల‌ను దాటుకుని నేటి స్థాయికి చేరింది. ఈ నేప‌థ్యంలో మొద‌టి రూపాయ

|

ఒక ప‌క్క నోట్ల ర‌ద్దు జ‌రిగి ఏడాది పూర్త‌యి దానిపైన విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు కొన‌సాగుతుండ‌గా మ‌రో ఆస‌క్తిక‌ర అంశం వెలుగులోకి వ‌చ్చింది. మొద‌టిసారి దేశంలో రూపాయి నోటు ముద్ర‌ణ జ‌రిగి ఈ రోజుకు స‌రిగ్గా వందేళ్లు పూర్తి అయింది. మొద‌టిసారి కాగిత‌పు ముద్ర‌ణ‌కు నోచుకున్న రూపాయి నోటు ఎన్నో చ‌రిత్రాత్మ‌క ఘ‌ట‌నల‌ను ముద్ర‌ల‌ను త‌న‌లో ఇముడ్చుకుంది. ఎన్నో మ‌రుపురాని ఘ‌ట్టాల‌ను దాటుకుని నేటి స్థాయికి చేరింది. ఈ నేప‌థ్యంలో మొద‌టి రూపాయి నోటు ముద్ర‌ణ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా దాని గురించి ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు తెలుసుకుందాం.

1. నోటు మీద ఏముంటుందో తెలుసా

1. నోటు మీద ఏముంటుందో తెలుసా

మ‌నం బ్రిటీష్ పాల‌న‌లో ఉన్న‌ప్పుడే మొద‌టి రూపాయి క‌రెన్సీ విడుద‌ల‌యింది. న‌వంబ‌రు 30,1917 బ్రిటీష్ హ‌యాంలో రూపాయి బ‌య‌ట‌కు వ‌చ్చింది. న‌వంబ‌రు 30న రిలీజ్ అయిన రూపాయి నోటులో "I promise to pay" అనే అక్ష‌రాలు ఉన్నాయి.

 2. మొద‌టి నోటు కింగ్ జార్జ్ V ఫోటోతో

2. మొద‌టి నోటు కింగ్ జార్జ్ V ఫోటోతో

దేశంలో మొద‌ట విడుద‌లైన రూపాయి నోటు కింగ్ జార్జ్ V ఫోటోతో ముద్రిత‌మై ఉంది. ఆ మొద‌టి నోటును 1926 త‌ర్వాత మార్చేశారు. పాత (మోడ‌ల్)వాటి విడుద‌ల‌ను ఆపేశారు. మ‌ళ్లీ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో కింగ్ జార్జ్ VI బొమ్మ‌తో మ‌ళ్లీ పున‌ర్మిద్రించి మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టారు.

3. 60 ర‌కాల రూపాయి నోట్లు

3. 60 ర‌కాల రూపాయి నోట్లు

స్వాతంత్రం వ‌చ్చిన త‌ర్వాత‌ 1948 నుంచి 60 ర‌కాల రూపాయి నోట్లు మార్కెట్లోకి ప్ర‌వేశించాయి. వాట‌న్నింటిపై ఉన్న సీరియ‌ల్ సంఖ్య‌లు వేర్వేరుగా ఉండ‌టం ప్ర‌త్యేక‌త‌. అంతే కాకుండా వివిధ రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్నర్ల సంత‌కాలు వాటిపై ఉన్నాయి.

 4. వేరే దేశాల్లో

4. వేరే దేశాల్లో

1970 ల వ‌ర‌కూ మ‌న రూపాయి నోటును ప‌ర్షియా, దుబాయి, బ‌హ్రెయిన్, మ‌స్క‌ట్, ఒమ‌న్ వంటి గ‌ల్ఫ్ దేశాల‌లోనూ క‌ర‌న్సీగా వాడారు. ఒక వేళ ఆ నాటి రూపాయి నోట్లు మీ ద‌గ్గ‌ర ఉంటే నాణేలు, పాత క‌రెన్సీలు సేకరించే ఔత్సాహికుల ద‌గ్గ‌ర నుంచి మీరు 20 నుంచి 30 వేల వ‌రకూ సంపాదించ‌వ‌చ్చు.

 5. బ‌ర్మాలో రూపాయి

5. బ‌ర్మాలో రూపాయి

1945 సంవ‌త్స‌రంలో బ‌ర్మాలో రూపాయి నోట్ల‌ను పంపిణీ చేశారు. ఆర్మీ ద‌ళాల బొమ్మ‌ల‌తో ఎరుపు రంగుతో ఆ నోట్లు ముద్రించ‌బ‌డి ఉన్నాయి.

 6. హైద‌రాబాద్ రాజ్యంలో

6. హైద‌రాబాద్ రాజ్యంలో

అప్ప‌టి రాచ‌రిక రాజ్యాలైన ఉస్మానియా, హైద‌రాబాద్ 1919లో మొద‌టిసారి రూపాయి నోటును విడుద‌ల చేశాయి. త‌ర్వాత 1943,1946ల‌లోనూ రూపాయి నోటును ముద్రించి చ‌లామ‌ణీలోకి తెచ్చిన‌ట్లు ఆర్బీఐ వెబ్‌సైట్ పేర్కొంది.

7. కాశ్మీర్లో

7. కాశ్మీర్లో

1877లో కాశ్మీర్ రాష్ట్రంలో శ్రీ‌కార్ రూపాయి నోట్ల‌ను జారీ చేశారు. మ‌న దేశంలో ఎక్కువ‌గా వెండి నుంచి ఇత‌ర నాణేల‌కు వెళ్ల‌డం, కాగిత‌పు క‌రెన్సీకి మ‌ళ్ల‌డం 1800 నుంచి 1900 మ‌ధ్య‌లోనే సాగింది.

 8. స్వాతంత్రం త‌ర్వాత 1948లోనే

8. స్వాతంత్రం త‌ర్వాత 1948లోనే

ఆగ‌స్టు 15,1947లో దేశానికి స్వాతంత్రం సిద్దించిన త‌ర్వాత మొద‌టి రూపాయి క‌రెన్సీని 1948లో జారీ చేశారు. ఆ నోటు వైవిధ్య‌మైన సైజు,రంగులో ఉంది. అందులో వ‌న్ రూపి అని 8 భాష‌ల్లో రాసి ఉంది. అందులో మ‌ళ‌యాళం లేదు. కేర‌ళ రాష్ట్రం 1956లో అవ‌త‌ర‌ణ అయిన‌ప్ప‌టి నుంచి కేర‌ళ రాష్ట్ర భాష అయిన మ‌ళ‌యాళం క‌రెన్సీ నోట్ల‌పైకి వ‌చ్చింది.

9. అధికారిక ముద్ర‌ణ‌

9. అధికారిక ముద్ర‌ణ‌

అశోక స్తూపంతో కూడిన ముద్ర‌ణ‌తో వ‌చ్చిన రూపాయి నోటును 1949లో ప్ర‌వేశ‌పెట్టారు. త‌ర్వాత 1950 నుంచి అదే అధికారిక ముద్ర‌ణ లాగా త‌యార‌వ‌డం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణం. ఎందుకంటే ఏ దేశ‌మ‌యినా చ‌రిత్ర‌ను గుర్తుంచుకోవాలి. మ‌న చ‌రిత్ర ఆన‌వాళ్ల‌ను చాటే వాటిలో అశోక స్తంభం(స్తూపం) ఒక‌టి.

10. 1948 నుంచి 2014 దాకా

10. 1948 నుంచి 2014 దాకా

1949లో భార‌త ప్ర‌భుత్వం కొత్త డిజైన్‌తో రూపాయి నోటును తీసుకొచ్చింది. ఆ నోట్ల‌పై అప్ప‌టి ఆర్థిక కార్య‌ద‌ర్శి కే ఆర్ కే మీన‌న్ సంత‌కం ఉంది. ఇటీవ‌ల 1994-95 మ‌ధ్య దేశంలో 4 కోట్ల రూపాయి క‌రెన్సీ నోట్ల‌ను విడుద‌ల చేశారు. దాని త‌ర్వాత 1995-96 నుంచి 2013-14 మ‌ధ్య ఎలాంటి రూపాయి నోట్ల‌ను విడుద‌ల చేయ‌లేద‌ని క‌రెన్సీ నోట్ల ప్రెస్ డెప్యూటీ మేనేజ‌ర్(హెచ్ఆర్), పీఐవో జీ క్రిష్ణ మోహ‌న్ అప్ప‌ట్లో ఒక స‌మాచార హ‌క్కు ద‌ర‌ఖాస్తుకు స‌మాధాన‌మిచ్చారు.

Read more about: rupee currency rbi
English summary

రూపాయి నోటు వ‌చ్చి 100 ఏళ్లయిన సంద‌ర్భంగా 10 విశేషాలు | All you wanted to know in 10 pts as ruppe note completed 100 years in India

The One Rupee note is the only note that bears the signature of Finance Secretary of India since its issuance from the Republic India. All other notes bear the signature of the Governor of the Reserve Bank of India.
Story first published: Thursday, November 30, 2017, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X