బిగ్ టీవీని అమ్మేసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్
కంపెనీ అప్పులను తగ్గించుకోవడానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన డీటీహెచ్ సంస్థ బిగ్‌టీవీని విక్రయించనుంది. దీనికోసం పెంటెల్ టెక్నాలజీస్, వీకాన్ మీడియా అండ్ టెలివిజన్‌తో ఒప్పందం కుదుర్చుకున
కంపెనీ అప్పులను తగ్గించుకోవడానికి అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన డీటీహెచ్ సంస్థ బిగ్‌టీవీని విక్రయించనుంది. దీనికోసం పెంటెల్ టెక్నాలజీస్, వీకాన్ మీడియా అండ్ టెలివిజన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. అయితే ఎంత మొత్తానికి అమ్ముతోందో వెల్లడించలేదు. గత నెలలోనే రిలయన్స్ కమ్యూనికేషన్స్ వీకాన్ మీడియా సంస్థతో ఒక ఒప్పందం కుదర్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశ డీటీహెచ్ రంగంలో తీవ్ర పోటీ నెలకొని ఉంది. జీ గ్రూప్ చెందిన డిష్ టీవీ ఇండియా లిమిటెడ్, టాటా స్కై లిమిటెడ్, వీడియోకాన్ డీటీహెచ్ లిమిటెడ్, సన్ డైరెక్ట్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్, భారతీ టెలిమీడియా లిమిటెడ్ దేశ ప్రయివేటు రంగంలో ఉన్న డీటీహెచ్ కంపెనీలు.

ప్రస్తుతం నష్టాలతో సతమతమవుతున్న ఆర్ కామ్ రుణ భారాన్ని కొంత మేరకు తగ్గించుకునేందుకు ఈ డీల్ పనికొస్తుంది. దీంతో ఆర్‌కామ్ వాటాదార్లకు, రుణదాతలకు ప్రయోజనం చేకూరుతుందని సదరు సంస్థ పేర్కొంది. అయితే ఈ విక్రయంతో బిగ్‌టీవీవి ప్రస్తుతమున్న 12 లక్షల మంది వినియోగదారులకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది. ఎప్పటిలాగే వారికి సేవలు అందుతాయని చెపింది. ఇందులో పనిచేస్తున్న సుమారు 500 మంది ఉద్యోగాలు కొనసాగుతాయని భరోసా ఇచ్చింది.
ఇండియా, దక్షిణ-తూర్పు ఆసియా,గల్ఫ్ కౌన్సిల్, ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో పెంటెల్ టెక్నాలజీ సంస్థకు కార్యకలాపాలు ఉన్నాయి. మరో సంస్థ వీకాన్ మీడియా అండ్ టెలివిజన్ లిమిటెడ్ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. దీనికి టెలివిజన్ కంటెంట్ నిర్మాణం, పంపిణీ వంటి కార్యకలాపాలు ప్రధాన వ్యాపారంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications