రూ.25 లక్షల పైన డిపాజిట్ చేసిన వాళ్లలో లక్షకు పైగా నోటీసులు
అప్పుడు బాగానే బ్యాంకుల్లో జమ చేశారు. ఇప్పుడు వారికి మూడింది. పెద్ద నోట్ల మార్పిడి(రద్దు) తర్వాత బ్యాంకుల్లో రూ.25 లక్షలకు మించి జమ చేసి గడువులోపల రిటర్నులు దాఖలు చేయని 1.16 లక్షల మందికి
అప్పుడు బాగానే బ్యాంకుల్లో జమ చేశారు. ఇప్పుడు వారికి మూడింది. పెద్ద నోట్ల మార్పిడి(రద్దు) తర్వాత బ్యాంకుల్లో రూ.25 లక్షలకు మించి జమ చేసి గడువులోపల రిటర్నులు దాఖలు చేయని 1.16 లక్షల మందికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. బ్యాంకుల్లో రూ.2.5 లక్షలకు మించి డిపాజిట్లు చేసిన 18 లక్షల మందిని ఐటీ శాఖ గుర్తించింది. వీరిలో రూ.25 లక్షలకు మించి బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారికి నోటీసులు పంపింది. ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారిని రెండు వర్గాలుగా విభజించారు. రూ.25 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు చేసిన వారు, రూ.10 నుంచి రూ.25 లక్షల మధ్య డిపాజిట్ చేసిన వారిగా వేరు చేశారు. అందులో రూ.25 లక్షల కంటే ఎక్కువ జమ చేసిన వారి సంఖ్య 1.16 లక్షలుగా ఉంది. వారందరికీ నోటీసులు పంపామని 30 రోజుల్లోగా ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సిందిగా సమయం ఇచ్చామని సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్రా చెప్పారు.

మొత్తం 2లక్షల 40 వేల మంది రూ.10 నుంచి రూ.25 లక్షల వరకూ నగదు డిపాజిట్లు చేశారు. రెండో దశలో వీరికి నోటీసులు పంపుతామని ఆయన అన్నారు. ఐటీ చట్టాన్ని అనుసరించి నోటీసులు వెళ్లాయన్నారు. ఐటీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను ఏప్రిల్-సెప్టెంబరు మధ్య 619 మందిని విచారించినట్లు వెల్లడించారు. మొత్తం 16.92 లక్షల బ్యాంకు ఖాతాలను జల్లెడ పట్టి క్లీన్ మనీ ఆపరేషన్‌ను చేపట్టారు. ఇందులో చాలా మందిని వివరణ అడగ్గా కేవలం 11.8 లక్షల మంది మాత్రమే స్పందించారు. దాదాపు రూ.3 లక్షల కోట్లకు సంబంధించి 17.73 లక్షల కేసులను అనుమానస్పదంగా గుర్తించారు. వారిపై ప్రభుత్వ నిఘా ఉంది. దశల వారీగా విచారణ కొనసాగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications