106 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
వరుస 8 సెషన్ల లాభాల తర్వాత సెన్సెక్స్ మంగళవారం ట్రేడింగ్‌లో నష్టపోయింది. సెప్టెంబరు త్రైమాసికం సంబంధించిన ఆర్థిక వివరాలు వెలువడనుండటంతో పాటు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు దిగల
వరుస 8 సెషన్ల లాభాల తర్వాత సెన్సెక్స్ మంగళవారం ట్రేడింగ్‌లో నష్టపోయింది. సెప్టెంబరు త్రైమాసికం సంబంధించిన ఆర్థిక వివరాలు వెలువడనుండటంతో పాటు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు దిగలాగడంతో మార్కెట్లు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 105.85 పాయింట్లు కోల్పోయి 33,618.59 వద్ద నిలవగా, మరో సూచీ నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 10370 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సూచీలో కన్సూమర్ డ్యూరబుల్స్(0.92%), టెక్నాలజీ(0.64%), పీఎస్‌యూ(0.61%), ఐటీ(0.55%) రంగాలు నష్టపోగా; మరో వైపు ఎఫ్ఎంసీజీ(0.1%), వాహన రంగం(0.04%) లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభపడ్డ, నష్టపోయిన షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి. మారుతి సుజుకి(1.48%), హెచ్‌డీఎఫ్‌సీ(1.03%), కోల్ ఇండియా(1.03%), ఏసియన్ పెయింట్స్(1.01%), బజాజ్ ఆటో(0.68%) లాభపడ్డాయి. మరో వైపు ఎన్‌టీపీసీ(1.88%), భారతీ ఎయిర్టెల్(1.56%), ఇన్ఫోసిస్(1.3%), టాటా మోటార్స్(1.23%), సన్ ఫార్మా(1.19%) నష్టపోయాయి.


Click it and Unblock the Notifications