హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో రైలు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం నుంచి ప్రయాణానికి అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి నాగోల్ నుంచి మియాపూర్ వరకూ ఉన్న మార్గాన్ని ప్ర
హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో రైలు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం నుంచి ప్రయాణానికి అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి నాగోల్ నుంచి మియాపూర్ వరకూ ఉన్న మార్గాన్ని ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో మెట్రో ప్రాధాన్యాలు, విశేషాల గురించి తెలుసుకుందాం.

1. హైదరాబాద్‌కు మెట్రో రైలు అవసరం ఏమిటి.?
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ నగర విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. మొత్తం మెట్రోపాలిటన్ ఏరియా 6852 చదరపు కి.మీ మేర విస్తరించి ఉంది. ఐటీ,ఐటీఈఎస్, బయోటెక్, ఫార్మా, టూరిజం రంగాల్లో ఈ నగరం శరవేగంగా వృద్ది చెందుతోంది.
ప్రస్తుత నగర జనాభా 60 నుంచి 80 లక్షలుగా ఉండగా, 2021 నాటికి 1.40 కోట్లు ఉంటుందని అంచనా.
ప్రస్తుతానికి హైదరాబాద్ రోడ్ల మీద 50 లక్షల వ్యక్తిగత వాహనాల వినియోగం ఉంది. ఏటా 5 లక్షల వాహనాలు పెరుగుతుంటాయని అంచనా వేస్తున్నారు.
ప్రతి రోజూ 80 లక్షల ట్రిప్పుల మేర మోటారు వాహనాల మీద ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. ఇందులో ప్రజా రవాణా ద్వారా జరుగుతున్నది కేవలం 40%,32 లక్షలు మాత్రమే.
ఇలా ఒక పక్క జనాభా పెరుగుతూ, ప్రజా రవాణా మీద ఆధారపడే వారి సంఖ్య తక్కువగా ఉంటే నగర రోడ్లు ట్రాఫిక్ మయమవుతాయి. భాగ్యనగరానికి గుర్గావ్, బెంగుళూరు లాంటి పరిస్థితే ఏర్పడుతుంది.

2. 72 కి.మీ మెట్రో
ఇందుకు పరిష్కారంగా వచ్చిందే మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఎమ్ఆర్టీఎస్). మొదటి దశలో హైదరాబాద్ మెట్రోకు 72 కి.మీ మేర రూపకల్పన చేశారు. ఇందులో 3 ఎక్కువ జనసమ్మర్థమైన ప్రాంతాలను ఎంచుకున్నారు. మూడు రూట్లలో ఎక్కువ మంది తిరుగుతారని శాస్త్రీయంగా అంచనా వేసి వాటిని ఎంపిక చేశారు. వీటిని పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంలో భాగంగా నిర్మించు-నిధులుసేకరించు-బదలాయించు తరహాలో నిర్మిస్తారు. అంటే చివరికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది.

3.హైదరాబాద్ మెట్రో 3 లైన్లు(కారిడార్లు)
మూడు కారిడార్‌లలో 72 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మిస్తున్నారు. కారిడార్-1( మియాపూర్-ఎల్‌బీనగర్)ను 'ఏ' ఆంగ్ల అక్షరంతోనూ, కారిడార్-2 (జెబీఎస్-ఎంజీబీఎస్) 'బీ'తోనూ, కారిడార్-3( నాగోల్-హైటెక్ సిటీ)ని 'సీ'తో గుర్తించి నంబర్లను కేటాయించారు.

4. హైదరాబాద్ మెట్రో ద్వారా నగరానికి ప్రయోజనాలు
తక్కువ ప్లేస్ వాడుకుంటూ మంచి రవాణా వ్యవస్థ సమకూర్చడం మెట్రో వ్యవస్థ ప్రాధాన్యతం. అంతే కాకుండా ఇంధన అవసరాలు సైతం ఎక్కువ లేకుండా వేగవంతమైన ప్రయాణం దీని ద్వారా సాధ్యపడుతుంది.
ఎక్కువ రద్దీ సమయాల్లో అవసరమైన రూట్లలో అధిక ట్రిప్ కోచ్‌లను నడుపుకునే సౌలభ్యం ఉంటుంది.
వాతావరణ కాలుష్యం ఎక్కువ లేకుండా, తక్కువ శబ్ద కాలుష్యం మెట్రో రైలు మరో ప్రత్యేకత.
రోడ్డు రవాణాతో వాడుతున్న దానితో పోలిస్తే ఒక్కో ప్యాసెంజర్‌కు కి.మీ 20% తక్కువ ఇంధన వినియోగం జరుగుతుంది.
ఇతర రవాణా వ్యవస్థలతో పోలిస్తే బస్సు ట్రాఫిక్ 7 లైన్లలో తీసుకెళ్లే, కార్లలో 24 లైన్లలో వెళ్లే ప్రయాణికుల ట్రాఫిక్‌కి సమానంగా మెట్రో జనాలను ఒక చోట నుంచి మరో చోటకు చేర్చగలదు.
ఇది ఎలివేటెడ్ మెట్రో రైలు ప్రాజెక్టు కావడం వల్ల రోడ్డు మీద చాలా తక్కువ విస్తీర్ణాన్ని మాత్రమే ఆక్రమించింది.
ప్రయాణ సమయం: ఇతర రవాణా వ్యవస్థల కంటే 50% నుంచి 75% తక్కువ సమయంలోనే చేర్చగల వేగం దీని సొంతం.

5. స్టేషన్లు-కిలో మీటర్లలో దూరం
మొత్తం 72 కి.మీ దూరం నిర్మిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టులో ఇప్పుడు ప్రారంభిస్తున్నది కేవలం 30 కి.మీ.
మెట్రో 72 కి.మీ ప్రాజెక్టును 3 కారిడార్ల రూపంలో చేపట్టారు.
కారిడార్ 1: మియాపూర్-ఎల్‌బీ నగర్ : 29 కిలోమీటర్లు : 27 స్టేషన్లు
కారిడార్ 2: ఫలక్ నామా- జేబీఎస్ : 15 కిలో మీటర్లు : 15 స్టేషన్లు
కారిడార్ 3: నాగోల్-రాయదుర్గం : 28 కిలో మీటర్లు : 24 స్టేషన్లు

6. మెట్రో రైలు ప్రత్యేక ఫీచర్లు
పిల్లర్ల మీద ట్రాక్లు వేసి ఒకదాని పక్కన ఒకటి, ఒకటి కొంచెం పైన మరొకటి కించం కింద అలా రెండు ట్రాక్‌లను నిర్మించి పూర్తిగా భూమికి పైన ఎత్తులో నిర్మించిన(ఎలివేటెడ్) రైలు ప్రాజెక్టు. రోడ్డు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా దీన్ని నిర్మించారు.
సగటున ప్రతి 1 కి.మీ దూరంలో స్టేషన్లు ఉండేలా నిర్మించారు. అక్కడ ప్యాసెంజర్లు స్టెయిర్ కేస్లు, ఎలివేటర్లు, లిఫ్ట్ ద్వారా ఎక్కడం, దిగడం చేయవచ్చు.
మొదట్లో 17 లక్షలతో మొదలుకొని, 2024 కల్లా రోజూ 22 లక్షల మందిని తీసుకెళ్లేలా మెట్రో నిర్మించారు.
ప్రయాణ సమయం: మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ ప్రయాణానికి పట్టే సమయం 46 నిమిషాలు
జుబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్‌నామా మధ్య ప్రయాణానికి పట్టే సమయం 22 నిమిషాలు
నాగోల్- రాయదుర్గం మధ్య ప్రయాణానికి పట్టే సమయం 39 నిమిషాలు

7. మెట్రో వచ్చిన తర్వాత దాని ప్రత్యేకత ఎలా తెలుస్తుంది?
మెట్రోకు వేల కోట్లు ఖర్చు పెట్టినా దాని ద్వారా కలిగే ప్రయోజనాలను బట్టి ప్రాజెక్టు ప్రత్యేకతను అందరికీ తెలిసేలా చేస్తుంది.
రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి
ప్రయాణికుల మీద ప్రయాణం ద్వారా కలిగే ఒత్తిడి తక్కువ అవుతుంది. దీని ద్వారా పని మీద ఏకాగ్రత వస్తుంది.
వాహనాల సంఖ్య తగ్గడం మూలంగా రోడ్డు మీద దుమ్ము తగ్గి, డస్ట్ పొల్యూషన్ నియంత్రించబడుతుంది.
ఎక్కువగా నడిచే వారికి, బస్సు ప్రయాణికులకు సులువుగా చేరుకోగలిగేలా నిర్మాణం ఉంది.
ప్రయాణికులకు అనుకూలంగా స్టేషన్ల నిర్మాణం ఉండటం వల్ల ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కి, అవసరమైన చోట దిగొచ్చు. ప్రయాణికుల రద్దీ, అవసరాల ఆధారంగా స్టేషన్లను నిర్మించారు.
సామాన్యుల జేబుకు చిల్లు పడకుండా అనువైన ధరల్లోనే ప్యాసెంజర్ టిక్కెట్ ధరను నిర్ణయించారు.

8. టిక్కెట్ల రేట్లు
టిక్కెట్ల రేట్లను మొదట్లో తక్కువగానే పెట్టాలని అనుకున్నా ప్రాజెక్టు ప్రారంభం ఆలస్యం కావడం, నిర్మించిన ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మరింత జాప్యం కారణంగా మెట్రో రైలు టిక్కెట్లను ఎక్కువ ధరకే అమ్మేలా చేసింది.
2 కి.మీ లోపు (కనీస టిక్కెట్ ధర) - రూ.10
2 కి.మీ నుంచి 4 కి.మీ వరకూ - రూ.15
4 కి.మీ నుంచి 6 కి.మీ వరకూ - రూ.25
6 కి.మీ నుంచి 8 కి.మీ వరకూ - రూ. 30
8 కి.మీ నుంచి 10 కి.మీ వరకూ - రూ.35
10 కి.మీ నుంచి 14 కి.మీ వరకూ - రూ.40
14 కి.మీ నుంచి 18 కి.మీ వరకూ- రూ.45
18 కి.మీ నుంచి 22 కి.మీ వరకూ - రూ.50
22 కి.మీ నుంచి 26 కి.మీ వరకూ- రూ.55
26 కి.మీ కంటే ఎక్కువ దూరానికి- రూ.60

9. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు వ్యయం
మొదట 2010లో రీబిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఈ ప్రాజెక్టను ఎల్ అండ్ టీ 12132 కోట్లకు చేపట్టింది.
తర్వాత వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకుని ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రూ.14,132 కోట్ల మేర నిర్ణయించారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే సరికి ఇది రూ.15 వేల కోట్లకు చేరగలదని అంచనా.

10. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు దక్కించుకున్న అవార్డులు
2016లో దేశంలో ఉత్తమ రవాణా ప్రాజెక్టు అవార్డును స్కోచ్ ప్లాటినమ్ నుంచి అందుకున్నది.
ప్రపంచ మౌలిక వసతుల కల్పనా సదస్సులో హెచ్ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ గ్లోబల్ ఇంజినీరింగ్ ప్రాజెక్టు అవార్డు అందుకున్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణ భద్రతకు సంబంధించి రాయల్ సొసైటీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్ అవార్డు వరుసగా మూడు సంవత్సరాలు గెలుచుకుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications