పాలసీదారులు తమ ఆధార్ సంఖ్యను ఎస్ఎంఎస్ ద్వారా అనుసంధానం చేసుకోవాలంటూ తమ లోగోతో వస్తున్న సందేశాలను పట్టించుకోనక్కర్లేదని జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) స్పష్టం చేసింది. ఇలాంటి సందేశాలను నమ్మవ
పాలసీదారులు తమ ఆధార్ సంఖ్యను ఎస్ఎంఎస్ ద్వారా అనుసంధానం చేసుకోవాలంటూ తమ లోగోతో వస్తున్న సందేశాలను పట్టించుకోనక్కర్లేదని జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) స్పష్టం చేసింది. ఇలాంటి సందేశాలను నమ్మవద్దని ప్రజలను కోరింది.
" కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఎల్ఐసీ ఎంబ్లమ్, లోగోతో పాటుగా అనుమానప్పద సందేశాలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో పాలసీదారులను ఆధార్ నంబరుతో పాలసీని అనుసంధానించాల్సిందిగా కోరుతున్నారు. ఇదంతా అనధికారికంగా జరుగుతోంది.'' అని ఎల్ఐసీ పబ్లిక్ నోటీసులో ప్రకటించింది.

అలాంటి సందేశాన్ని తాము అధికారికంగా ఎక్కడ కూడా పంపలేదని జీవిత బీమా సంస్థ స్పష్టం చేసింది. అంతే కాకుండా ఎల్ఐసీ వద్ద సంక్షిప్త సందేశం ద్వారా పాలసీని, ఆధార్ సంఖ్యతో అనుసంధానించే విధానం అందుబాటులో లేదని వివరించింది. ఎప్పుడైనా ఈ రకమైన సదుపాయాన్ని ప్రారంభిస్తే ఎల్ఐసీ తమ వెబ్సైట్లో అప్డేట్ చేస్తుందని జీవిత బీమా సంస్థ పేర్కొంది. అయితే పాలసీదారులంతా తమ పాలసీలను ఆధార్ సంఖ్యతో అనుసంధానించడాన్ని బీమా నియంత్రణ, అభివృద్ది ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏ) ఆదేశించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications