జీఎస్టీ రేట్లను నిర్ణయించిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తుంటే వినియోగదారులు ఏం చేయాలి? జీఎస్టీ మోసాలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు వినియోగదారుల ముందు పలు మార్గాలున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్
జీఎస్టీ చట్టం అమలు నుంచి చాలా సార్లు వాటి రేట్లు మార్చారు. చాలా ఉత్పత్తుల్లో రేట్లు తగ్గడానికి ఆస్కారం ఉన్నా దుకాణదార్లు ఎక్కువ రేట్లలో ఉత్పత్తులను అమ్ముతున్నారు. ప్రధానంగా చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లలో పాత జీఎస్టీ ఛార్జీలనే వసూలు చేస్తున్నారు. గతంలో 12 శాతం(నాన్-ఏసీ రెస్టారెంట్లు), 18 శాతం (ఏసీ రెస్టారెంట్లు)గా ఉన్న జీఎస్టీ రేట్లను జీఎస్టీ కౌన్సిల్ ఐదు శాతానికి తగ్గించింది. అయితే చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో పాత జీఎస్టీ రేట్లనే వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు అందకుండా మెనూలో ధరలను పెంచేశారు.
జీఎస్టీ రేట్లను నిర్ణయించిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తుంటే వినియోగదారులు ఏం చేయాలి? జీఎస్టీ మోసాలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు వినియోగదారుల ముందు పలు మార్గాలున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్‌కు వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చు. జీఎస్టీ రేట్లను ఎక్కువగా వసూలు చేస్తున్న రెస్టారెంట్లపై ఫిర్యాదు చేసేందుకు దిగువున మూడు మార్గాలున్నాయి.

1. సీబీఈసీ జీఎస్టీ పోర్టల్‌లో ఫిర్యాదు:
జీఎస్టీ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు ఇది సులభమైన మార్గం. సీబీఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో HTTP://CBEC-GST.GOV.IN లో సీబీఈసీ మిత్రా హెల్ప్‌డెక్క్‌ను క్లిక్ చేయాలి. అందులోని రైజ్ వెబ్ టికెట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కొత్త విండోలో ట్యాక్స్ ఫ్రాడ్/అవాయ్‌డెన్స్‌ను క్లిక్ చేయాలి. ఇందులో మీ పూర్తి పేరు, ఈమెయిల్ అడ్రస్, రెస్టారెంట్ పేరు, అడ్రస్ వివరాలు పొందుపరిచి ఫిర్యాదు చేయొచ్చు.

2.ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు:
జీఎస్టీ మోసాలకు సంబంధించి వినియోగదారులు ఈ-మెయిల్స్ ద్వారా కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెసులుబాటు ఉంది. [email protected] అనే ఈ-మెయిల్ అడ్రస్‌కు మీ పేరు, ఫోన్ నెంబరు, రెస్టారెంట్ పేరు, అడ్రస్, ఫిర్యాదు వివరాలను తెలియజేస్తూ ఈ-మెయిల్ పంపితే దీనిపై అధికారులు చర్యలు తీసుకుంటారు.

3.టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు:
జీఎస్టీ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు మీకు మరో ప్రత్యామ్నాయ మార్గం ఇది. 18001200232 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి సీబీఈసీకి మీరు ఫిర్యాదు చేయొచ్చు.
జీఎస్టీ ఛార్జీలను ఎక్కువగా వసూలు చేసే అధికారం రెస్టారెంట్లకు లేదు. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే దీన్ని ప్రశ్నించడం మీ హక్కుగా గుర్తించండి. గది బాడుగ రూ.7,500కు పైగా ఉన్న 5 స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు ఔట్‌డోర్ క్యాటరింగ్‌పై మాత్రం జీఎస్టీ 18 శాతంగా ఉంటుంది.

4. జీఎస్టీ-అతిపెద్ద పన్ను సంస్కరణ
దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పరోక్ష పన్నుల్లో చేపట్టిన అతి పెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ. మొదట్లో బాలారిష్టాలు ఉన్నా నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయని అటు ప్రభుత్వ అధికారులు, ఇటు ప్రజలు భావించారు. అయితే పన్ను అమలు ప్రారంభమై 5 నెలలయినా చాలా సమస్యలు ఉన్నాయి. వ్యాపారులకైతే జీఎస్టీ పన్ను రిటర్నులు చేసేటప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలకైతే అధిక పన్ను రేట్ల బెడద ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వీటన్నింటికీ పరిష్కారం చూపాల్సి ఉంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications