భారత దేశంలో రవాణా రంగం విపరీతంగా వృద్ధి చెందుతోంది. దీని వల్ల చాలా ఆటో మొబైల్ కంపెనీలు వాటికీ లభిస్తున్న ప్రత్యేకమైన ఆదరణను ఎంతగానో ఆనందిస్తున్నాయి.భారత దేశంలో టాప్ 10 ఆటో మొబైల్ కంపనీ ల గురించి ఇప్
ఈ రోజుల్లో ఏదో వాహనం లేకుండా మధ్య తరగతికి సాధ్యం కావట్లేదు. వ్యవసాయరంగంలో కావొచ్చు, వ్యక్తిగత అవసరాలకు కావొచ్చు, పరిశ్రమ అవసరాలకు కావొచ్చు లేదా వాణిజ్య అవసరాలకు కావొచ్చు ఇలా ఏ రంగంలో అయినా కూడా రవాణాకు ప్రాముఖ్యత విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో రవాణా రంగం విపరీతంగా వృద్ధి చెందుతోంది. దీని వల్ల చాలా ఆటో మొబైల్ కంపెనీలు వాటికీ లభిస్తున్న ప్రత్యేకమైన ఆదరణను ఎంతగానో ఆనందిస్తున్నాయి.
భారత దేశంలో టాప్ 10 ఆటో మొబైల్ కంపనీ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

10. ఫోర్స్ మోటర్స్ లిమిటెడ్ :
ఈ సంస్థను 1958 సంవత్సరంలో, పూణే నగరంలో స్థాపించడం జరిగింది. ఎస్ యు వి, ట్రాక్టర్లు, చిన్న వాణిజ్య వాహనాలు, అంబులెన్సులు, స్కూల్ బస్సులు, వినియోగ వాహనాలు, వ్యాన్లు మరియు వ్యక్తిగత వాహనాలు ఇలా ఎన్నింటినో తయారు చేయడంలో ఈ సంస్థ ముందుంది. ముఖ్యంగా ఈ సంస్థ తయారుచేసే వాణిజ్య, వివిధ రకాల వినియోగ మరియు వ్యవసాయ వాహనాలకు పల్లెల్లో మరియు చిన్న పట్టణాల్లో విపరీతమైన ఆదరణ ఉంది.
Website : www.forcemotors.com

9. ఐచర్ మోటర్స్ :
భారత్ దేశంలోని గుర్గావ్ లో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. దీనిని 1948 లో ప్రారంభించారు. భారత్ దేశంలో మొట్టమొదట ట్రాక్టర్ ని తయారు చేసిన భారతీయ కంపెనీ ఇది. ఈ ఆవిష్కరణ వల్ల భారతదేశంలోని వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయని చెబుతారు. ఈ సంస్థ తయారుచేసే రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులకు దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ సంస్థ వోల్వో సంస్థతో కలిసి అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకొని ట్రక్కులు మరియు టెంపోలను తయారుచేస్తుంది.
Website : www.eicher.in

8. టి వి ఎస్ మోటార్ కంపెనీ :
1978 వ సంవత్సరంలో టి వి ఎస్ మోటార్ కంపెనీ తన ప్రస్థానాన్ని ఆటో మొబైల్ రంగంలో ప్రారంభించింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. భారతదేశంలో మూడవ అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఇది. ఈ సంస్థకు మొత్తం మూడు తయారీ యూనిట్లు ఉన్నాయి. ఒకటి తమిళనాడు సరిహద్దులో, ఇంకొకటి కర్ణాటకలో మరొకటి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి. అంతర్జాతీయంగా ఇండోనేషియా లో ఒక తయారీ సంస్థ ఉంది.
Website : www.tvsmotor.com

7. హ్యుండై
దక్షిణ కొరియా లోని సియోల్ ప్రాంతంలో 1967 వ సంవత్సరంలో ఈ కంపెనీ ని ప్రారంభించడం జరిగింది. భారత్ దేశంలో ఉన్న హ్యుండై కంపెనీ కొరియా లో ఉన్న హ్యుండై కంపెనీ కి అనుబంధ సంస్థ. భారతదేశంలో అత్యధికంగా కార్లను తయారుచేసే సంస్థల్లో ఈ సంస్థ రెండవ స్థానంలో ఉంది. ఈ కంపెనీ యొక్క ఎనిమిది రకాల ప్రయాణికుల కార్లు భారతీయ మార్కెట్లో ఉన్నాయి. ఇయాన్, ఐ 10, వెర్నా, ఎలైట్ ఐ 20, గ్రాండ్ ఐ 10, శాంటా ఫి, ఎలాంట్రా మరియు ఎక్ససెంట్. ఈ వాహనాలు మారుతి సంస్థ తయారు చేసే కార్లకు గట్టిపోటీని ఇస్తున్నాయి.
Website : www.hyundai.com/in/en/Main

6. అశోక్ లేల్యాండ్ :
ఈ సంస్థను 1948 లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం చెన్నై లో ఉంది. ప్రపంచంలో కెల్లా అత్యధికంగా బస్సులను తయారు చేసే సంస్థల్లో ఈ సంస్థ 4 స్థానంలో ఉంది. అత్యధికంగా వాణిజ్య వాహనాలను తయారు చేసే భారతీయ తయారీ సంస్థలలో ఈ సంస్థ రెండవ స్థానంలో ఉంది. ఈ సంస్థ తయారు చేసే వాహనాల్లో అతి ముఖ్యమైనది ఏమిటంటే బస్సులు, రవాణాకు ఉపయోగపడే తేలికపాటి వాహనాలు, ట్రక్కులు మరియు సైనిక సంబంధిత వాహనాలు.
Website : www.ashokleyland.com

5. బజాజ్ ఆటో లిమిటెడ్ :
ఈ సంస్థను 1930 లో స్థాపించడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం పూణే లో ఉంది. ద్విచక్ర మరియు త్రిచక్ర వాహనాలను తయారీ చేసే సంస్థల్లో భారత దేశంలోనే ముందు వరుసలో ఉన్న ఆటో మొబైల్ సంస్థ బజాజ్. ఒక దశాబ్ద కాలంపాటు భారత మార్కెట్ ను శాసించింది బజాజ్ చేతక్ స్కూటర్. 2001 వ సంవత్సరంలో ఈ సంస్థవారు పల్సర్ అనే బైక్ ని విడుదల చేసారు. అలా బైకులు తయారు చేసే విభాగంలోకి అడుగుపెట్టారు.
Website : www.bajajauto.com

4. హీరో మోటోకార్ప్ లిమిటెడ్:
ఈ సంస్థను 1982 లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ లో ఉంది. హోండా మోటార్స్ అనే జపాన్ కంపెనీ మరియు హీరో సైకిల్స్ అనే భారతీయ కంపెనీలు రెండు కలిసి సంయుక్తంగా ఈ ద్విచక్ర వాహనాల కంపెనీ ని ఏర్పాటుచేశాయి. భారత దేశంలోనే అత్యధికంగా ద్విచక్ర వాహనాలు తయారు చేసే సంస్థగా పేరు గడించింది. ఎంతో అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తయారీ వ్యవస్థను కలిగిన యూనిట్లు ఈ సంస్థకు హర్యానా మరియు గుర్గావ్ లో ఉన్నాయి.
Website : www.heromotocorp.com

3. మారుతి సుజికి :
ఈ సంస్థను 1982 లో గుర్గావ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. వ్యక్తిగత వాహనాల విభాగంలో ఈ సంస్థకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ సంస్థ ప్రవేశ పెట్టిన మారుతి 800 కారు దిగ్గజ కారుగా ఓ వెలుగు వెలిగింది. ఈ కార్లు ఒకానొక సమయంలో భారత దేశం మొత్తంగా విపరీతంగా అమ్ముడుపోయాయి. ప్రయాణికుల కార్ల విభాగంలో ఈ సంస్థ దగ్గర వివిధరకాల కార్లు ఉన్నాయి. ఆల్టో, వెగ్నార్, రిట్జ్, ఓమ్ని, ఎస్టిలో, స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, ఎస్ ఎక్స్ 4 మరియు సెలెరియో అనే మరో కొత్త వాహనాన్ని ఈ మధ్యనే విడుదల చేయడం జరిగింది. ఈ సంస్థకు గుర్గాన్ మరియు మానేసర్ అనే ప్రాంతాల్లో రెండు తయారీ యూనిట్లు ఉన్నాయి.
Website : www.marutisuzuki.com

2. మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్:
పంజాబ్ రాష్ట్రంలో లూథియానా అనే ప్రాంతంలో 1945 వ సంవత్సరంలో ఈ సంస్థను స్థాపించారు. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రాక్టర్ తయారీ సంస్థగా మహేంద్ర సంస్థకు పేరుంది. అంతేకాకుండా భారత దేశంలో అతిపెద్ద వాహనాల తయారీ సంస్థల్లో ఈ సంస్థ రెండవ స్థానంలో నిలిచింది. ద్విచక్రవాహనాలు, ట్రక్కులు, చిన్నపాటి వాహనాలు, టెంపోలు, బస్సులు, ట్రాక్టర్లు, సైనిక సంబంధిత వాహనాలు మరియు వ్యవసాయానికి సంబంధించిన వివిధరకాల పరికరాలు ఇలా ఎన్నింటినో ఈ సంస్థ అందిస్తోంది. అటు పల్లెళ్ళతో పాటు ఇటు పట్టణాల్లో కూడా ఈ సంస్థకు మంచి పట్టు ఉంది.
Website : www.mahindra.com

1. టాటా మోటార్స్ :
ఈ సంస్థను 1945 వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆటో మొబైల్ తయారీ సంస్థగా ఈ సంస్థకు పేరుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. భారతదేశంలో 6 ప్రాంతాల్లో ఈ సంస్థకు అత్యాధునిక తయారీ మరియు విడిభాగాలను ఒక్కటిగా చేసే కర్మాగారాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నాలుగు దేశాల్లో కూడా ఈ సంస్థ యొక్క తయారీ యూనిట్లు ఉన్నాయి. 70 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కార్లను, బస్సులను, ట్రక్కులను, వ్యాన్లను, నిర్మాణానికి సంబంధించిన పరికరాలను, కోచ్ లను, సైనిక సంబంధిత ట్రక్కులను మరియు ఇతర రకాల వాహనాలను ఎన్నింటినో ఈ సంస్థ తయారు చేస్తోంది. అంతర్జాతీయంగా ఈ సంస్థ యొక్క బ్రాంచీలు యు కె, ఇండోనేషియా, దక్షిణ ఆఫ్రికా, థాయిలాండ్ మరియు దక్షిణ కొరియా లలో ఉన్నాయి.
website:tatamotors.com
తెలుగు.గుడ్‌రిటర్న్స్.ఇన్
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications