గో ఎయిర్ నుంచి రూ. 312 కే విమాన టిక్కెట్ల ధ‌ర‌ల ఆఫ‌ర్ ప్రారంభం

సంస్థ 12 వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా త‌న వినియోగ‌దారుల‌కు 12 త‌క్కువ రేట్ల‌లో విమాన టిక్కెట్ల‌ను అందిస్తున్న‌ట్లు వెల్లడించింది. త‌క్కువ ధ‌ర క‌లిగిన విమాన టిక్కెట్ల రూట్ల వివ‌రాలు మీ కోసం...

ముంబయికి చెందిన చౌక ధ‌ర‌ల విమాన‌యాన సంస్థ గో ఎయిర్ శుక్ర‌వారం త‌క్కువ ధ‌ర‌ల‌కే విమాన‌ టిక్కెట్ల‌ను అందుబాటులో ఉంచ‌డం ప్రారంభించింది. సంస్థ 12 వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా త‌న వినియోగ‌దారుల‌కు 12 త‌క్కువ రేట్ల‌లో విమాన టిక్కెట్ల‌ను అందిస్తున్న‌ట్లు వెల్లడించింది. త‌క్కువ ధ‌ర క‌లిగిన విమాన టిక్కెట్ల రూట్ల వివ‌రాలు మీ కోసం...

టిక్కెట్ల ధ‌ర‌లు ఇలా...

టిక్కెట్ల ధ‌ర‌లు ఇలా...

దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థ గో ఎయిర్ భారీ రాయితీలకు టిక్కెట్ల‌ను ఇస్తున్న‌ట్లు తెలిపింది. చౌక ధ‌ర‌ల టిక్కెట్లు రూ.312 నుంచి మొద‌లై రూ.2412 వ‌ర‌కూ ఉన్నాయి. ఇందులో ప‌న్నులు ఉండ‌వు. అంటే టిక్కెట్ ధ‌ర మీద ప‌న్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ప్ర‌యాణాల తేదీలు ఎప్పుడు?

ప్ర‌యాణాల తేదీలు ఎప్పుడు?

మొత్తం ఈ 12 ర‌కాల టిక్కెట్ల రేట్లు డిసెంబ‌రు 1,2017 నుంచి అక్టోబ‌ర్ 28,2018 మ‌ధ్య చేసే ప్ర‌యాణాల‌కు అందుబాటులో ఉంటాయి.

ఏయే మార్గాలు, ఏయే న‌గ‌రాలు

ఏయే మార్గాలు, ఏయే న‌గ‌రాలు

త‌క్కువ రేట్లు ఉన్న విమాన టిక్కెట్లు కేవ‌లం 54 రూట్ల‌లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 7 న‌గ‌రాల‌కు సంబంధించి మాత్ర‌మే ఇవి ప‌నిచేస్తాయి. న్యూఢిల్లీ, కొచ్చి, బెంగుళూరు, హైద‌రాబాద్‌, చెన్నై, అహ్మ‌దాబాద్, ల‌క్నో వంటి ముఖ్య న‌గ‌రాల్లో ప్ర‌మోష‌న‌ల్ రేట్ల‌లో టిక్కెట్లు త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తాయి. ముందు వ‌చ్చిన వారికే మొద‌టి ప్రాముఖ్య‌త మాదిరిగా ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంద‌ని గోఎయిర్ వెబ్‌సైట్లో రాసి ఉంది. టిక్కెట్ల‌ను గో ఎయిర్ వెబ్‌సైట్ www.Goair.in, గోఎయిర్ టిక్కెట్ల కార్యాల‌యాలు, గో ఎయిర్ యాప్ ద్వారా లేదా స్థానిక ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవ‌చ్చు.

గో ఎయిర్ విమానాలు తిరిగే మార్గాలు

గో ఎయిర్ విమానాలు తిరిగే మార్గాలు

గో ఎయిర్ విమానాలు అహ్మ‌దాబాద్‌, బ‌గోఢా, బెంగుళూరు, భువ‌నేశ్వ‌ర్, చండీఘ‌డ్, చెన్నై, ఢిల్లీ, గోవా, గౌహతి, జైపూర్, జ‌మ్ము, కొచ్చి, కోల్‌క‌త‌, లెహ్, ల‌క్నో,ముంబ‌యి, నాగ్‌పూర్, ప‌ట్నా, పోర్ట్ బ్లెయిర్, పుణె, రాంచి, హైద‌రాబాద్‌, శ్రీ‌న‌గ‌ర్ మార్గాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ డ‌బ్బు సంపాద‌న‌కు 10 చ‌క్క‌టి మార్గాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+