ఐలాండ్ మరియు ఐర్లాండ్ వంటి ఇతర దేశాలలో పెట్టుబడి మరియు బలమైన బ్యాంకింగ్ వ్యవస్థలు ఆర్థిక వృద్ధికి సహాయపడ్డాయి. ఈ విధంగా తలసరి ఆదాయ పరంగా ప్రపంచంలో 15 ధనిక దేశాల జాబితాలను ఇక్కడ చూద్దాం.
ఒక్కో వ్యక్తి ఆదాయం పరంగా ప్రతి సంవత్సరం ప్రపంచంలోని దాదాపు 200 దేశాలలో ఎన్నో దేశాలు బిలియన్లు,అలాగే ట్రిలియన్ల స్థాయిలో ఉన్నాయి. కానీ ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశంగా ఏది ప్రథమ స్థానంలో ఉంటుంది? తెలుగు గుడ్‌రిటర్న్స్ ఈ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం లేదా అత్యంత సంపన్న దేశాల గురించి తెలుసుకోవడం కోసం కొంత సమాచారాన్ని సేకరించింది.
IMF ప్రకారం ఈ ర్యాంకింగ్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి యొక్క అక్టోబరు 2017 లోని సమాచారం ఆధారంగా మరియు కొనుగోలు శక్తి నిచ్చే సమానత ఆధారంగా తలసరి GDP పై ఆధారపడిన వస్తువుల ఖర్చుతో సంబంధించి దేశాల కరెన్సీలతో పోల్చుతుంది. ఇవీటిని ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు.
బ్రూనై, ఖతార్ వంటి అత్యధిక ర్యాంకు గల దేశాలలో ఇంధనం మరియు చమురు వాటి దేశ ఆర్థిక వ్యవస్థలను ఆ దేశాలను సుసంపన్నం చేస్తున్నాయి. ఏదేమైనా, 2014 లో చమురు ధర తగ్గించటంవలన ఎక్కువ ధనిక దేశాల్లో జీడీపీ వృద్ధి చెందింది. ఐలాండ్ మరియు ఐర్లాండ్ వంటి ఇతర దేశాలలో పెట్టుబడి మరియు బలమైన బ్యాంకింగ్ వ్యవస్థలు ఆర్థిక వృద్ధికి సహాయపడ్డాయి. ఈ విధంగా తలసరి ఆదాయ పరంగా ప్రపంచంలో 15 ధనిక దేశాల జాబితాలను ఇక్కడ చూద్దాం.

15. ఐస్‌లాండ్ (52,150 డాలర్లు)
IMF ప్రకారం, పర్యాటక రంగం, ఎగుమతులు మరియు పెట్టుబడులు ఐస్ల్యాండ్ యొక్క జీడీపీ వృద్ధికి దోహదం చేసాయి. దేశ పర్యాటక రంగం యొక్క వృద్ధి దీర్ఘకాలం ఉంటుందని IMF అంచనా వేసింది.

14. నెదర్లాండ్స్ ($ 53,580)
IMF 2016 నివేదికలో నెదర్లాండ్స్ ఆర్ధిక పునరుద్ధరణ ద్వారా ముందుకు సాగుతుందని తెలిపింది. అయితే బ్రెక్సిట్ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. నెదర్లాండ్స్ లో కేవలం 17 మిలియన్ల జనాభా మాత్రమే ఉంది. అరుబా, కురాకో, మరియు సిన్ట్ మార్టెన్ అనేవి నెదర్లాండ్స్ లో కలిసే ఉన్నాయి.

13. సౌదీ అరేబియా ($ 55,260)
సౌదీ అరేబియా జీడీపికి చమురు మూలకారణం అని చెప్పవచ్చు. అయితే IMF ప్రకారం చమురేతర ఆర్థిక వృద్ధి ఉండాలని అనుకుంటున్నారు. అలాగే 32 మిలియన్ల దేశం "Vision 2030" సంస్కరణ కార్యక్రమం కూడా ఉంది. ఇది ఇప్పటిదాకా చమురు మీద ఆధారపడిన దేశం. చమురు ఆర్ధిక వ్యవస్థకు దూరంగా ఉండటానికి ఒక ఆర్ధిక ప్రణాళికను వేస్తున్నారు.

12. యునైటెడ్ స్టేట్స్ ($ 59,500)
IMF ప్రకారం, 325 మిలియన్ల మంది నివసించే అమెరికా 1850 నుంచి దాని దీర్ఘకాల ఆర్థిక విస్తరణ దశలోనే ఉంది. 2016 లో IMF నివేదిక ప్రకారం నిరుద్యోగ రేటు అమెరికాలో తక్కువగానే ఉన్నా సరే ఖర్చులు మరియు పెట్టుబడుల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది.

11. శాన్ మారినో ($ 60,360)
IMF నివేదికల ప్రకారం, మాంద్యం తరువాత పెరుగుతున్న ఉపాధి రేట్లు మరియు దేశీయ మరియు బాహ్య డిమాండ్ శాన్ మారినో యొక్క GDP పెరుగుదలకు దోహదపడ్డాయి. ఈ దేశ జనాభా 90 లక్షలు మాత్రమే.

10. హాంగ్ కాంగ్ ($ 61,020)
IMF ప్రకారం, 2016 వ సంవత్సరంలో హాంకాంగ్ యొక్క వృద్ధి రేటు మందగించింది. అయినప్పటికీ ప్రపంచంలోని ధనిక దేశాలలో ఒకటిగా నిలిచింది. గత సంవత్సరం చైనా వాణిజ్యం మరియు పర్యాటక రంగం తగ్గుముఖం పట్టింది. కానీ 2017 సంవత్సరంలో హాంగ్ కాంగ్ యొక్క వృద్ధి రేటు బాగుటుందని అంటున్నారు. హాంగ్ కాంగ్ లో సుమారుగా 70 లక్షలకు పైగా జనాభా ఉన్నారు.

9. స్విట్జర్లాండ్ ($ 61,360)
2015 నాటికి 80 లక్షల మంది ప్రజలుకలిగిన స్విస్ ఆర్ఘిక మాంద్యం నుంచి కోలుకున్నాక దాని కేంద్ర బ్యాంకు 52 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.స్విట్జర్లాండ్ వృద్ధి 2016 లో 1 1/2% చేరుకుందని IMF నివేదించింది. దేశం దాని ఆర్థిక పునరుద్ధరణ పెంచడానికి సహాయపడే అనేక చర్యలను తీసుకుంది.

8. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ($ 68,250)
IMF ప్రకారం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచంలోని ధనిక దేశాలలో ఒకటిగా ఉంది. చమురు మార్కెట్ ద్వారా ఆర్ధికవ్యవస్థ ముందుకు సాగుతోంది. 2016 వ సంవత్సరంలో దేశంలో అభివృద్ధి లేకపోవడానికి దిగువ చమురు ధరలు మరియు ఉత్పత్తి కారణం అయ్యాయి. అయితే IMF ప్రకారం, UAE లో చమురేతర పెరుగుదల కూడా ఉంది. ఇక్కడ కేవలం 10 మిలియన్ల జనాభా మాత్రమే ఉన్నారు. ఇది 2017 లో పెరుగుతుందని భావిస్తున్నారు.

7. కువైట్ ($ 69,670)
కువైట్ లో 4 మిలియన్ల జనాభా ఉన్నారు. 2016 లో ఇది కూడా ఇతర చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థల ధోరణిని నెమ్మదిగా ఎదుర్కొంది. ఎందుకంటే IMF ప్రకారం, చమురు ధరలు మరియు ఉత్పత్తి తగ్గుముఖం పడడంతో, ఎక్కువగా చమురు ప్రాంతాల్లో పెరుగుదల కనిపించింది. చమురు వృద్ధిరేటు పెరుగుతుందని భావిస్తున్నట్లు IMF తెలిపింది.

6. నార్వే ($ 70,590)
స్కాండినేవియన్ దేశము 50 లక్షలకు పైగా నివాసితులను కలిగి ఉంది. ఇది తలసరి ప్రపంచపు మొదటి ఐదు ధనిక దేశాలకు వెలుపల ఉంది. IMF ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ చమురు ధరల కారణంగా దేశం ప్రతికూలంగా ప్రభావితం అయ్యి ఉంది. 2008 మరియు 2009 నాటి ఆర్థిక తిరోగమనం నుండి నార్వే కూడా దాని యొక్క కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే గత వేసవిలో దాని నిరుద్యోగం రేటును తగ్గించగలిగింది.

5. ఐర్లాండ్ ($ 72,630)
ఐరోపాలోనే అత్యధిక వృద్ధి రేటు ఉన్న దేశాలలో ఐర్లాండ్ ఒక దేశంగా ఉంది. ఇది ప్రపంచంలోని అగ్ర ఐదు సంపన్న దేశాలలో ఒకటిగా ఉంది. IMF నివేదిక ప్రకారం, 2016 లో ఐర్లాండ్ ఖర్చు, పెట్టుబడి మరియు నిర్మాణంలో GDP పెరుగుదలను చూపింది.

4. బ్రూనై ($ 76,740)
2016 లో బ్రూనై యొక్క GDP వృద్ధి క్షీణించింది. IMF ప్రకారం ఆ తర్వాత దేశం ఊహించిన దాని కంటే మెరుగైనది. బ్రూనే 4,00,000 మంది జనాభా కలిగిన సంపన్న దేశం. బ్రూనై యొక్క ప్రధాన ఎగుమతి చమురు అయినప్పటికీ, చమురు విపణిలో తగ్గుముఖం పట్టడంలో విజయం సాధించింది. 2014 IMF ప్రకారం బ్రూనై యొక్క ఆదాయం దాదాపుగా 90 శాతం చమురు మరియు సహజ వాయువు నుండి వస్తుంది.

3. సింగపూర్ ($ 90,530)
సింగపూర్ ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలలో ఒకటిగా ఉంది. IMF ప్రకారం 2017 మొదటి త్రైమాసికంలో దాని వాస్తవ జీడీపీ 2.7% వృద్ధిని సాధించింది. గత సంవత్సరం నుండి 5.6 మిలియన్ జనాభా ఉన్న నగరం నిరంతరం పెరుగుతోంది. ప్రపంచ ఎలక్ట్రానిక్ వర్తకాలు తిరిగి పుంజుకున్నాయి. విస్తృత స్థాయిలో, IMF సింగపూర్ యొక్క ఆర్థిక వృద్ధి ప్రధానంగా నిపుణుల ఆధారిత రంగాలకు పరిమితం చేయబడింది.

2. లక్సంబర్గ్ ($ 109,190)
లక్సంబర్గ్ ప్రపంచంలోని రెండో అత్యంత సంపన్న దేశంగా ఉంది. ఈ దేశంలో దాదాపు 600,000 మంది జనాభా ఉన్నారు. దేశం ఒక బలమైన శ్రామిక శక్తిని కలిగి ఉంది. అలాగే దాని 2016 అభివృద్ధి యూరోపియన్ యూనియన్ యొక్క మొత్తం అభివృద్ధిని మించిపోయింది. అయితే, IMF ప్రకారం బ్రెక్సిట్ నుండి మారుతున్న ప్రకృతి దృశ్యం మరియు U.S. కోసం వస్తున్న విధాన మార్పులు మార్కెట్ అస్థిరతను సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఐఎంఎఫ్(IMF) అంచనాల ప్రకారం ఈ దేశ వ్యక్తుల తలసరి ఆదాయం 1,09,190డాలర్లుగా ఉంది

1. ఖతార్ ($ 124,930)
చిన్న మధ్యప్రాచ్య దేశం అయినా సరే తరచుగా ప్రపంచ తలసరి ఆదాయపరంగా ధనిక దేశాలలో ఒకటిగా ఉంది. ఈ దేశ జనాభా సుమారు 26.94లక్షలు. IMF ప్రకారం, ఇక్కడ ఒక వ్యక్తి తలసరి ఆదాయం GDP $ 124,930 ఉంది. 2017 నాటికి ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశంగా ఉంటుంది. కతర్ దేశంలో హైడ్రోకార్బన్ ఇంధనం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. హైడ్రోకార్బన్ తక్కువ ధరలను ఎదుర్కొన్నప్పటికీ దేశం వృద్ధి చెందింది. కతర్ యొక్క GDP పెరుగుదల 2017 నాటికి కూడా అలాగే కొనసాగుతుందని భావిస్తున్నారు.

పిల్లల కోసం ఆరు ఉత్తమ పొదుపు ఖాతాలు

బంగారం ధర మారేందుకు కారణమయ్యే 10 అంశాలు

తెలుగు వ్యక్తి నిర్మించిన మహా వ్యాపార సామ్రాజ్యం

మన దేశంలో అత్యధిక వేతనాలిచ్చే ఉద్యోగాలివే... చేరిపోతారా?

సంప్రదాయ పాలసీలు: బీమా ఏజెంట్లు చెప్పని 7 ముఖ్యమైన అంశాలివే!
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్‌ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications