100 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్
ఒకరోజు నష్టాల తరువాత దేశీ స్టాక్ మార్కెట్లు మళ్లీ జోరందుకున్నాయి. రోజు మొత్తం పటిష్ట లాభాలతో కదిలాయి. చివరికి చెప్పుకోదగ్గ స్థాయిలో బలపడ్డాయి.
ఒకరోజు నష్టాల తరువాత దేశీ స్టాక్ మార్కెట్లు మళ్లీ జోరందుకున్నాయి. రోజు మొత్తం పటిష్ట లాభాలతో కదిలాయి. చివరికి చెప్పుకోదగ్గ స్థాయిలో బలపడ్డాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 118 పాయింట్లు లాభపడి 33,478 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 225 పాయింట్ల వరకూ ఎగసింది. నిఫ్టీ 28 పాయింట్లు పుంజుకుని 10,327 వద్ద స్థిరపడింది. తొలుత 10,350ను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడటంతో దేశీయంగానూ ఆ ప్రభావం కనిపించినట్లు నిపుణులు పేర్కొన్నారు.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో డాక్టర్ రెడ్డీస్(4.99%), సన్ ఫార్మా (+ 4.18%), సిప్లా (+ 2.31%), భారతీ ఎయిర్టెల్ (+ 2.13%), ఎన్టిపిసి (+ 1.61%) ముందున్నాయి, మరో వైపు నష్టపోయిన వాటిలో కోల్ ఇండియా (-1.51%), ఐటిసి (-1.08%), పవర్ గ్రిడ్ (-1.03%), టిసిఎస్ (-1.02%), కోటక్ బ్యాంక్ (-0.77%) ఉన్నాయి.
విశాఖపట్నం యూనిట్‌కు సంబంధించి రెడ్డీస్ ల్యాబరేటరీస్ తనిఖీ నివేదికలు రావడంతో ఈ కంపెనీ సూచీ బాగా రాణించింది.


Click it and Unblock the Notifications