క‌ళ్లు చెదిరే ప్ర‌పంచ టాప్ 10 ఫ్యాష‌న్ దుస్తుల బ్రాండ్లివే!

ఫ్యాష‌న్ ప్రియుల‌కు బ్రాండ్లంటే పిచ్చి. య‌ కూడా ఇప్పుడు బ్రాండ్ బ్రాండ్ అంటూ క‌ల‌వ‌రిస్తున్నారు. మ‌రి ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో అత్య‌ధిక విలువ క‌లిగిన బ్రాండ్లు ఏమిటో తెలుసుకోవాలనుందా... ఈ జాబితాలో మీరు వాడ

ఫ్యాష‌న్ ప్రియుల‌కు బ్రాండ్లంటే పిచ్చి. మ‌ధ్యత‌ర‌గ‌తి కూడా ఇప్పుడు బ్రాండ్ బ్రాండ్ అంటూ క‌ల‌వ‌రిస్తున్నారు. మ‌రి ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో అత్య‌ధిక విలువ క‌లిగిన బ్రాండ్లు ఏమిటో తెలుసుకోవాలనుందా... ఈ జాబితాలో మీరు వాడే వ‌స్తువులేమైనా ఉన్నాయని తెలుసుకోవాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నారా... అయితే ఇంకెందుకు ఆల‌స్యం...టాప్ 10 బ్రాండ్ క్లాతింగ్ సెగ్మెంట్ విశేషాల క‌థాహారాన్ని తెలుసుకునేందుకు మీ మౌస్ ను కిందికి రోల్ చేసేందుకు సిద్ధంకండి.

10. వెర్సేస్

10. వెర్సేస్

వెర్సేస్ ఇట‌లీకి చెందిన ప్ర‌ఖ్యాత దుస్తుల బ్రాండ్‌. గియ‌న్నీ వెర్సేస్ అనే వ్య‌క్తి దీన్ని 1978లో స్థాపించాడు. సంస్థ ఆదాయం 1 బిలియ‌న్ డాల‌ర్లు కాగా, మొత్తం బ్రాండ్ విలువ 5.5 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. వెర్సేస్ ఉత్త‌మ క్లాతింగ్ బ్రాండ్‌గా మాత్ర‌మే పేరు తెచ్చుకోలేదు. ప్ర‌పంచంలో అతి ఖ‌రీదైన బ్రాండెడ్ దుస్తుల‌ను రూపొందించిందే సంస్థ‌లో ఇదీ ఒక‌టి. ట్రెండ్‌ను ఫాలో అయ్యేవాళ్లు ఈ బ్రాండ్‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. అలాగే ఈ బ్రాండ్లో లేటెస్ట్ ఫ్యాష‌న్ వ‌స్తే ఎంత ధ‌ర అయినా స‌రే కొనేందుకు ఫ్యాష‌న్ ప్రియులు ఇష్ట‌ప‌డ‌తారు. ముదురు రంగులు, త‌ళుకులీనే చ‌మ‌క్కుల‌తో బ‌ట్ట‌లు ఆక‌ర్షిస్తుంటాయి.

9. ఫెండి

9. ఫెండి

ఇట‌లీకి చెందిన ఈ ఫ్యాష‌న్ బ్రాండ్‌ను 1925లో పాలో ఫెండి అనే వ్య‌క్తి స్థాపించాడు. ఈ సంస్థ మొత్తం బ్రాండ్ విలువ 3.5 బిలియ‌న్ డాల‌ర్లు కాగా ఆదాయ‌మే 1 బిలియ‌న్ డాల‌ర్ వ‌స్తుంటుంది. యాక్సెస‌రీలు, లెద‌ర్ బ్యాగుల‌కు ఈ బ్రాండ్ చాలా ప్ర‌ఖ్యాతిగాంచింది. ప్ర‌త్యేకంగా బ‌గెట్టీ సిరీస్‌లో 1997లో వ‌చ్చిన హ్యాండ్ బ్యాగ్ ల‌కు ఇప్ప‌టికీ ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు. ఒక్కో ఉత్ప‌త్తిని వినూత్నంగా త‌యారుచేస్తుంద‌నే పేరు ఫెండీకుంది. ల‌గ్జ‌రీ బ్రాండ్ ప‌రంగా కొత్త కొత్త టెక్నిక్స్ వాడుతూ ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో అప్‌డేట్‌గా ఉంటారు.

8. అర్మానీ

8. అర్మానీ

ప్ర‌పంచంలో ఉన్న దుస్తుల బ్రాండ్ల‌లో అర్మానీ చాలా ప్ర‌ముఖ‌మైన‌ది. ఇదీ ఇట‌లీకి చెందిన సంస్థే కావ‌డం విశేషం. బ్రాండ్ విలువ 3.1 బిలియ‌న్ డాల‌ర్లు కాగా, ఆదాయ‌మే 3.5 బిలియ‌న్ డాల‌ర్లు. అత్యంత ఖ‌రీదైన దుస్తుల బ్రాండ్ల‌లో అర్మానీకి తిరుగులేదు. ఈ అంత‌ర్జాతీయ సంస్థ వివిధ ర‌కాలైన ఉత్ప‌త్తుల‌ను త‌యారుచేస్తుంది. సుగంధ ప‌రిమ‌ళాలు, లెద‌ర్ బ్యాగులు, కళ్ల‌ద్దాలు, బూట్లూ, ఆభ‌ర‌ణాలు మొద‌లుకొని ఎన్నె ఎన్నెన్నో త‌యారుచేస్తుంది. హాలీవుడ్ తార‌లు ఎక్కువ‌గా అర్మానీ బ్రాండ్ నే వాడేందుకు ఇష్ట‌ప‌డ‌తారు.

7. బుర్బెర్రీ

7. బుర్బెర్రీ

బుర్బెర్రీ బ్రిట‌న్‌కు చెందిన ల‌గ్జ‌రీ ఫ్యాష‌న్ సంస్థ‌. థామ‌స్ బుర్బెర్రీ అనే వ్య‌క్తి 1856లో దీన్ని స్థాపించారు. ఈ సంస్థ బ్రాండ్ విలువ 5.87 బిలియ‌న్ డాల‌ర్లు కాగా ఆదాయం 3.6 బిలియ‌న్ డాల‌ర్లు. మంచి నాణ్య‌మైన దుస్తులు, సుగంధ ప‌రిమ‌ళాలు, ఫ్యాష‌న్ యాక్స‌స‌రీలు, స‌న్ గ్లాసులు, కాస్మొటిక్స్‌ను ఈ సంస్థ అమ్ముతుంది. ఈ సంస్థ బుర్బెర్రీ లండ‌న్‌, బుర్బెర్రీ బ్రిట్‌, బుర్బెర్రీ ప్రోర్స‌మ్ లాంటి అనుబంధ బ్రాండ్ల‌తో అమ్మ‌కాలు జ‌రుపుతుంది. దాదాపు 50దేశాల్లో 500 స్టోర్లు ఉన్నాయి దీనికి. ట్రెంచ్ కోట్‌కు ఈ సంస్థ చాలా ఫేమ‌స్‌. దీనికోసం ఎలిజ‌బెత్ 2 రాణితోనూ, వేల్స్ రాజ‌కుమారిడితో ప్ర‌త్యేకంగా రాయ‌ల్ వారెంట్‌ను తీసుకోవ‌డం విశేషం.

6. ప్రాడా

6. ప్రాడా

మ‌ళ్లీ ఇట‌లీ ఫ్యాష‌న్ బ్రాండ్ వ‌చ్చేసింది. బ్రాండ్ విలువ సుమారు 7.3 బిలియ‌న్ డాల‌ర్లు. ఆదాయం సుమారు 3.91 బిలియ‌న్ డాల‌ర్లు. మారియో ప్రాడా అనే వ్య‌క్తి 1913లో దీన్ని స్థాపించాడు. ఆయ‌న లెద‌ర్ ఉత్ప‌త్తిదారుగా ప‌నిచేసేవారు. ఇదెంతో ఖ‌రీదైన బ్రాండు, సినీ తార‌లంతా ఈ బ్రాండ్ దుస్తుల‌ను వేసుకునేందుకు బాగా ఇష్ట‌ప‌డ‌తారు. ప్రాడాలో రెడీమెడ్ దుస్తులు, ఫ్యాష‌న్ యాక్స‌స‌రీలు, బూట్లు, ఆధునిక సూట్‌కేసులు, వాచీలు ఎన్నో ఉంటాయి.

5. గూచీ

5. గూచీ

ల‌గ్జ‌రీ క్లాతింగ్ బ్రాండ్ లో గూచీ పేరు విన‌ని వాళ్లు చాలా అరుదు. ఇట‌లీలోని ఫ్లారెన్స్ ప్రాంతంలో గూషియో గూచీ అనే వ్య‌క్తి 1920లో ఈ సంస్థ‌ను స్థాపించాడు. ఈ సంస్థ బ్రాండ్ విలువ ఏకంగా 12.4 బిలియ‌న్ డాల‌ర్లు ఉందంటే ఎంత విలువైందో చెప్పొచ్చు. ఇక ఆదాయం కూడా 4.5 బి.డాల‌ర్లు స‌మ‌కూరుతుంది. హై క్వాలిటీ దుస్తులు, వాచీలు, ఆభ‌ర‌ణాలు, బూట్లు, లెద‌ర్ వ‌స్తువులు, ఫ్యాష‌న్ యాక్సస‌రీల‌కు గూచీ పెట్టింది పేరు. అత్యంత ఖ‌రీదైన క్లాతింగ్ బ్రాండ్స్‌లో ప్ర‌పంచంలో దీనికి మంచి పేరుంది. ప్ర‌ముఖ సెల‌బ్రిటీలు గూచీని ఎక్కువ‌గా వాడ‌తారు.

4. చానెల్‌

4. చానెల్‌

బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తుల‌కు చానెల్ విఖ్యాతిగాంచింది. అంతేకాదు ఫ్యాష‌న్ యాక్సెస‌రీలు, ల‌గ్జ‌రీ వ‌స్తువుల‌కు ఇది ప్ర‌ముఖం. ఇదో ఫ్రెంచ్ కంపెనీ. దీన్ని 1909లో కోకో చానెల్ స్థాపించాడు. ప్రముఖ‌, ధ‌నిక సెల‌బ్రిటీలంతా చానెల్ బ్రాండ్‌నే ఎంచుకుంటారు. ఎంతో స్టైలిష్‌, రిచ్ డిజైన్ల‌ను సంస్థ రూపొందిస్తుంది. ఏ ఇత‌ర కంపెనీల‌ను ఇది కాపీ కొట్ట‌దు. త‌న‌దైన సొంత శైలిలోనే రూప‌క‌ల్ప‌న చేస్తుంది. బ్రాండ్ విలువ 6.8 బిలియ‌న్ డాల‌ర్లు కాగా ఆదాయం 5.4 బిలియ‌న్ డాల‌ర్లు. అత్యంత ఖ‌రీదైన వాటిలో ఇదీ ఒక‌టి.

3. హర్మే

3. హర్మే

థియ‌రీ హ‌ర్మే అనే ఫ్రెంచ్ దేశ‌స్థుడు ఈ సంస్థ‌ను స్థాపించాడు. టాప్ 10 బ్రాండ్ల‌లో హ‌ర్మే మూడో స్థానాన్ని ద‌క్కించుకుంది. ఈ సంస్థ రెవెన్యూ 5.37 బిలియ‌న్ డాల‌ర్లు కాగా బ్రాండ్ విలువ ప‌రంగా 10.6 బిలియ‌న్ డాల‌ర్లు. రెడీమేడ్‌, లెద‌ర్ , ఫ్యాస‌న్ దుస్తులు, ల‌గ్జ‌రీ ఉత్ప‌త్తులు లాంటివెన్నో ఈ సంస్థ తయారుచేస్తుంది. కెల్లీ బ్యాగుల‌కు ఇదెంతో ఫేమ‌స్‌, సంస్థ కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 8,050 ప‌నిచేస్తున్నారు.

2. రాల్ఫ్ లారెన్‌

2. రాల్ఫ్ లారెన్‌

అమెరికాకు చెందిన ఈ సంస్థ టాప్ 10లో రెండో స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. ఈ బ్రాండ్‌ను బిలియ‌నీర్ ఫ్యాష‌న్ డిజైనర్ అయిన రాల్ఫ్ లారెన్ 1967లో స్థాపించాడు. ఏటా ఇదే సంస్థ లీడింగ్ బ్రాండ్ల‌లో చోటు సంపాదించుకుంటూ వ‌స్తుంది. మొత్త‌మంతా హై ఎండ్ దుస్తులు, యాక్సెస‌రీల త‌యారీ పైనే సంస్థ దృష్టి పెడుతుంది. పోలో రాల్ప్ లారెన్‌, రాల్ఫ్ లారెన్ క‌ల‌క్ష‌న్‌, రాల్ఫ్ లారెన్ చిల్డ్ర‌న్స్‌వేర్‌, డ‌బుల్ ఆర్ ఎల్, డెనిమ్ లాంటి ఎన్నో పేర్ల‌తో ఉత్ప‌త్తులను త‌యారుచేస్తుంది. 6.6 బిలియ‌న్ డాల‌ర్ల బ్రాండ్ విలువ క‌లిగిన ఈ సంస్థ‌కు సుమారు 7.4 బిలియ‌న్ డాల‌ర్ల ఆదాయం స‌మ‌కూరుతుంది.

1. లూయిస్ విట్టన్

1. లూయిస్ విట్టన్

నెంబ‌ర్ 1 స్థానాన్ని సొంతం చేసుకుంది లూయిస్ విట్ట‌న్‌. ప్ర‌పంచంలో అత్యంత విలువైన క్లాతింగ్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకుంది. బ్రాండ్ విలువ ఏకంగా 28.1 బిలియ‌న్ డాల‌ర్లు, సుమారుగా 10.1 బిలియ‌న్ డాల‌ర్ల ఆదాయం సంస్థ‌కు వ‌స్తుంది. యాంజెలీనా జోలి, సారా జెస్సికా పార్క‌ర్‌, కిమ్ క‌ర్దాషియా, లేడీ గాగా లాంటి ప్ర‌ఖ్యాత హాలీవుడ్ సెల‌బ్రిటీలు లూయిస్ విట్ట‌న్ బ్రాండ్‌నే ఎంచుకుంటారు.

విట్ట‌న్ అనే వ్య‌క్తి 1854లో పారిస్‌లో దీన్ని స్థాపించాడు. ఇంత వ‌ర‌కు ఈ సంస్థ బ్రాండ్‌ను త‌ల‌ద‌న్నేది ఏదీ రాలేదు. అంత‌లా విజ‌యాల‌ను అందుకుంది. ల‌గ్జ‌రీ లోదుస్తుల నుంచి రెడీమేడ్ దుస్తులు, యాక్సెస‌రీలు, స‌న్ గ్లాసెస్‌, బూట్లు, వాచీలు, ఆభ‌ర‌ణాలు ఇలా ఎన్నో బ్రాండెడ్ వ‌స్తువుల‌ను తయారుచేస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+