గూగుల్ ఇండియా రెవెన్యూ రూ.7000 కోట్లు
గూగుల్ సంస్థ ఇండియా విభాగం మొదటిసారి బిలియన్ డాలర్ల మార్కును తాకింది. గతేడాది కంపెనీ ఆదాయంలో సంభవించిన వృద్ది రేటు కంటే ఈ ఏడాది వృద్ది సగమే కావడం గమనార్హం. అ
గూగుల్ సంస్థ ఇండియా విభాగం మొదటిసారి బిలియన్ డాలర్ల మార్కును తాకింది. గతేడాది కంపెనీ ఆదాయంలో సంభవించిన వృద్ది రేటు కంటే ఈ ఏడాది వృద్ది సగమే కావడం గమనార్హం. అదే సమయంలో ఫేస్‌బుక్ మాత్రం తన రెవెన్యూను గతేడాదితో పోలిస్తే రెండింతలు పెంచుకోగలిగింది. ఎక్కువ మంది తమ ఉత్పత్తుల ప్రచారానికి గూగుల్ కంటే కూడా సోషల్ మీడియాను ఎంచుకుంటుండటమే దీనికి కారణం. గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు రూ.7208.9 కోట్ల ఆదాయాన్ని మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రకటించింది. ఇది డాలర్లలో చూస్తే 1.1 బిలియన్ డాలర్లు. అదే గతేడాది మార్చి(మార్చి,2016) సమయానికి గూగుల్ ఇండియా రెవెన్యూ రూ.5904 కోట్లు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 22% ఆదాయ వృద్దిని కనబరిచింది.

అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ సంస్థకు మన దేశంలో ఇంటర్నెట్ ఆధారిత సేవలైన గూగుల్ మ్యాప్స్, గూగుల్ యాడ్స్, గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, ఇతర సాఫ్ట్‌వేర్ సేవలు చాలా ఉన్నాయి. అయితే దీనికి ఎక్కువ ఆదాయం మాత్రం సెర్చ్ రిజల్ట్స్ దగ్గర వచ్చే డిస్‌ప్లే యాడ్స్ ద్వారా సమకూరుతోంది. ఈ విధమైన ప్రచారానికి సంబంధించి కంపెనీలు మూడింట రెండొంతుల ఆదాయాన్ని డిజిటల్ ప్రకటనల కోసం గూగుల్ కోసమే కేటాయిస్తుండగా గూగుల్ ఇందులో ఏకస్వామ్యాన్ని చలాయిస్తున్నది. అయితే అదే సమయంలో మాతృ సంస్థ గూగుల్ మొత్తం ఆదాయంలో దేశీయ సంస్థ గూగుల్ ఇండియా సాధిస్తున్న రెవెన్యూ 1% మాత్రమే.
ఫేస్ బుక్ 2017 ఆర్థిక సంవత్సరంలో 93% వృద్దితో రూ.341.8 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అదే సమయంలో గతేడాది 31 కోట్ల లాభం నుంచి 31% వృద్దితో రూ.40.6 కోట్ల లాభాన్ని చవిచూసింది.


Click it and Unblock the Notifications