మొదటిసారి రాకతోనే రిలయన్స్ జియో భారత టెలికాం రంగంలో సంచలనాలను సృష్టించింది. అయితే ఎకనమిక్ టైమ్స్ నివేదించిన ప్రకారం జియో ప్రభావంతో ఈ రంగంలో 75,000 మంది నిరుద్యోగులుగా మారారు.
మొదటిసారి రాకతోనే రిలయన్స్ జియో భారత టెలికాం రంగంలో సంచలనాలను సృష్టించింది. అయితే ఎకనమిక్ టైమ్స్ నివేదించిన ప్రకారం జియో ప్రభావంతో ఈ రంగంలో 75,000 మంది నిరుద్యోగులుగా మారారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఒత్తిడి, పోటీతత్వంతో టెలికాం ఆపరేటర్లు, సంస్థలు తమ ఆస్తులను అమ్మకుంటుండగా, ఇంకా కొన్ని సంస్థలు విలీనం బాట పట్టినాయి. దీంతో టెలికాం రంగంలో పనిచేస్తున్న 3,00,000 మంది ఉద్యోగుల్లో నాలుగో వంతు ఖాళీ అయ్యారు. ప్రస్తుతం ఈ రంగంలో ఉద్యోగుల సంఖ్య 2.25 లక్షలకు పడిపోయింది. పరిశ్రమను వీడుతున్న వారిలో 30 శాతం మంది మిడిల్ మేనేజ్‌మెంట్ విభాగం వారే కావడం గమనార్హం. టెలికం రంగంలో దాదాపు 50 శాతం మంది ఈ విభాగంలోనే పనిచేస్తున్నారు. జియో రాకతో ఏడాది కాలంలో జరిగిన పరిణామాల గురించి తెలుసుకుందాం.

ఉద్యోగాలు ఉఫ్...
టెలికామ్ సంస్థలన్నీ తమ ఆస్తులు విక్రయిస్తుండటంతో ఏడాది కాలంగా ఈ ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల ఆగిపోయింది. కంపెనీ మొత్తం వ్యయంలో మానవ వనరులకు దాదాపు 4 నుంచి 5 శాతమే ఖర్చుచేస్తారు. ప్రస్తుతం దాన్నీ కూడా భరించే స్థితిలో లేకపోవడంతో తొలి వేటు ఉద్యోగులపైనే పడుతోంది. దీని వల్ల ఈ రంగంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. యాజమాన్యాలు తమ ఉద్యోగులకు 3-6 నెలల వేతన ప్యాకేజీ ఇచ్చి సాగనంపుతున్నట్లు సమాచారం. ఇక ఖాళీ అయిన ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశమే లేదు.

ఐడియా, వోడాఫోన్, ఎయిర్టెల్ ఏం చేస్తున్నాయంటే...
ప్రస్తుతం టెలికాం రంగం రూ.5 లక్షల కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. గతేడాది సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో మార్కెట్ ప్రవేశంతో కంపెనీల రాబడి, లాభాలు, నగదు రాక ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న వొడాఫోన్, ఐడియా సెల్యులార్ విలీన ప్రక్రియలో ఉన్నాయి. ఈ ప్రక్రియ పూర్తియిన ఇందులోని 10 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారు. టాటా టెలీ సర్వీసెస్ వైర్‌లెస్ వ్యాపారం కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్టు భారతీ ఎయిర్‌టెల్ సంకేతాలిచ్చింది. ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌టెల్ తమ టవర్లను విక్రయానికి పెట్టిన సంగతి తెలిసిందే.

ఆర్‌కామ్ సంగతి ఇంతే...
రిలయన్స్ కమ్యూనికేషన్ సైతం తీవ్రమైన అప్పులతో కునారిల్లుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సంస్థ సైతం తన టవర్ల వ్యాపారాన్ని బ్రూక్ ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్‌కు అమ్మడం ద్వారా తన రుణ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిరకే డిసెంబరు 1 నుంచి 2జీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆర్‌కామ్ ప్రకటించిన సంగతి విదితమే. రిలయన్స్ కమ్యూనికేషన్ సేవలను వాడుతున్న వారు డిసెంబరు 1 నుంచి 31 లోపు ఇతర నెట్‌వర్క్లోకి మార్చుకోవచ్చు.

గణాంకాలు ఇలా...
ఏడాది కాలంలో 75,000 ఉద్యోగస్థులు ఈ రంగాన్ని వదిలేశారు.
ప్రస్తుతం టెలికాం రంగంలో 2.25 లక్షల మంది పనిచేస్తున్నారు.
ఉద్యోగాలు మానేసిన వారిలో మధ్య స్థాయి ఉద్యోగులు ఎక్కువ.
నేరుగా టెలికాం కంపెనీల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారి శాతం 25-30%
వెండర్ కంపెనీల నుంచి వైదొలగిన వారి శాతం 35-40%.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications