స్టాక్ మార్కెట్‌లో ఒక్కసారిగా ఊపందుకున్న అమ్మకాలతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 281 పాయింట్ల మేర క్షీణించి 33,033 వద్ద, నిఫ్టీ 96.80 పాయింట్ల నష్టంలో 10,224 వద్ద ముగిశాయి.
స్టాక్ మార్కెట్‌లో ఒక్కసారిగా ఊపందుకున్న అమ్మకాలతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 281 పాయింట్ల మేర క్షీణించి 33,033 వద్ద, నిఫ్టీ 96.80 పాయింట్ల నష్టంలో 10,224 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఈ రోజు 33,417 వద్ద గరిష్టాన్ని తాకగా 33000 వద్ద కనిష్టానికి వెళ్లింది. మిడ్ సెషన్ నుంచీ పెరిగిన అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈ,బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోయాయి. రెండు వరుస సెషన్లలో లాభాలకు చెక్ పెడుతూ ఈ రోజు మార్కెట్లు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ, ఆర్ఐఎల్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు పడిపోవడమే మార్కెట్లు ఇంతగా దిగజారడానికి కారణం.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(1.84%), కన్సూమర్ డ్యూరబుల్స్(1.76%), క్యాపిటల్ గూడ్స్(1.55%), స్థిరాస్తి(1.5%) నష్టపోయాయి. మరో వైపు ఐటీ(0.18%) మాత్రం కాస్త లాభపడి ఫర్వాలేదనిపించింది.

సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి. టీసీఎస్(2.06%), ఎం అండ్ ఎం(1.27%), సన్ ఫార్మా(0.99%), పవర్ గ్రిడ్(0.24%), కొటక్ బ్యాంక్(0.24%) లాభపడిన వాటిలో ముందున్నాయి. మరో వైపు నష్టపోయిన వాటిలో అదానీ పోర్ట్స్(4.11%), ఓఎన్జీసీ(3.41%), కోల్ ఇండియా(3.00%), హెచ్డీఎఫ్‌సీ(2.15%), ఎల్ అండ్ టీ(1.87%) ముందు ఉన్నాయి.


Click it and Unblock the Notifications