English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ఈ బిచ్చ‌గాళ్ల జీవితాలు సూప‌ర్ ఏహే

By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

తిండి, నివాసం, దుస్తులు లేకుండా దుర్భర జీవితం గడిపే యాచకుల జీవితం ఎవరికీ రాకూడదని కోరుకుంటాం. మన సమాజంలోనే ఉన్నా దారుణమైన జీవితాన్ని గడుపుతున్నారని జాలి పడతాం. ఇలా కోరుకునే వారి అంచనాలను ఓ యాచక కుటుంబాలు తలకిందులు చేస్తున్నారు ఈ ముంబ‌యి బిచ్చ‌గాళ్లు. పొట్టకూటి కోసం అడుక్కుంటూ బతుకుతున్న వీళ్లంతా మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాళ్ల‌ను చూసి జాలి ప‌డే స్థాయికి ఎదిగారు వీళ్లంతా. ఇంకెందుకు ఆల‌స్యం వాళ్ల గురించి తెలుసుకోండి మ‌రి...

1. దేశంలోనే ఖ‌రీదైన బెగ్గ‌ర్

1. దేశంలోనే ఖ‌రీదైన బెగ్గ‌ర్

అతని పేరు సందీప్ కుమార్. అతను ఇండియాలోనే అత్యంత ఖరీదైన బెగ్గర్. అతని ఆస్తులు అక్షరాల కోట్లలోనే ఉంటుంది. మార్కెట్ విలువ ప్రకారం దానికి రెట్టింపే ఉండొచ్చు, ఉంటుంది కూడా. ఈయన రోజుకి రూ 2500-3000, నెలకు 75000 పై మాటే. అలా వచ్చిన డబ్బుతోనే ముంబయ్ లోని పరేల్ ప్రాంతంలో రెండు ఫ్లాట్లు.., మరో షాప్ ను నడుపుతున్నాడు. వాటి అద్దె మరో రూ 63000 రూపాయల వరకూ ఉంటుంది.

2. శంభాజి కాలే

2. శంభాజి కాలే

ప‌శ్చిమ ముంబ‌యిలోని ఖార్ ఏరియాలో ఈ కుటుంబంలోని న‌లుగురు భిక్షాట‌న చేస్తారు. ఈ విధంగా సంపాదించిన డ‌బ్బుతో స్థిరాస్తికి య‌జ‌మాని అయ్యాడు శంభాజి. విరార్ ఏరియాలో ఒక సొంత ఫ్లాట్ ఉంది ఇత‌నికి. ఇంకా సోలాపూర్ జిల్లాలో వ్య‌వ‌సాయ భూమి ఉంది.దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు

3. స‌ర్వ‌తియా దేవీ

3. స‌ర్వ‌తియా దేవీ

ప‌ట్నాకు చెందిన స‌రితా దేవీ దాదాపు 25 ఏళ్ల నుంచి యాచ‌క వృత్తిలోనే ఉంది. భ‌ర్త హ‌ఠాత్తుగా మ‌ర‌ణించ‌డంతో ఆమె ఈ వృత్తిలోకి రావాల్సి వ‌చ్చింది. ఎక్కువ‌గా యాత్రికులు వ‌చ్చే స్థ‌లాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని చాలా ఏళ్ల పాటు డ‌బ్బు బాగా సంపాదించిన స‌ర్వ‌తియా త‌ర్వాత ఆ వృత్తిని వ‌దిలేసింది. ప్ర‌స్తుతం ఆమె మంచి ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఇంకా ఆమెకు రెండు ఇన్సూరెన్స్ పాల‌సీలు ఉన్నాయి. వాటి కోసం ఆమె ఏడాదికి రూ.36,000 ప్రీమియం చెల్లిస్తున్న‌ది.

4. క్రిష్ణ కుమార్ గీతే

4. క్రిష్ణ కుమార్ గీతే

ముంబ‌యిలో సీపీ ట్యాంక్ ఏరియాలో క్రిష్ణ కుమార్ గీతే నివాసం ఉంటాడు. ఆ ఏరియాలో నివ‌సించే వారిలో ఈయ‌న ఒక తోపు లాంటి వాడు.

ముంబైలోని న‌ల్ల‌సోపారా ఏరియాలో అత‌నికి సొంత స్థ‌లం ఉంది. అత‌ని ఆర్థిక వ్య‌వ‌హారాల‌న్నీ సోద‌రుడికి వ‌దిలేశాడు.

5. ల‌క్ష్మీ దాస్

5. ల‌క్ష్మీ దాస్

ల‌క్ష్మీ దాస్ జీవితం చాలా మంది బిచ్చ‌గాళ్ల‌కు ఆద‌ర్శం. ఆమె 44 ఏళ్ల పాటు ఈ వృత్తిలో కొన‌సాగి 90 కిలోల కాయిన్ల‌ను సేక‌రించింది. త‌ర్వాత బ్యాంకు ఖాతా తెరిచింది. ఈమెకు క్రెడిట్ కార్డు ద‌ర‌ఖాస్తుకు సైతం అర్హ‌త ఉంది.

16వ ఏట నుంచే అడుక్కుతిన‌డం మొద‌లుపెట్టింది. ఆమె ద‌గ్గ‌ర ఉన్న కొన్ని నాణేల‌లో ఇప్పుడు కొన్ని చెల్ల‌వంట‌. అయితే సీబీఐ ప్ర‌తినిధి ఒక‌రు మాట్లాడుతూ బ్యాంకు మాత్రం ఈమె ద‌గ్గ‌ర ఉన్న నాణేల‌ను ప్ర‌త్యేక అనుమ‌తితో స్వీక‌రిస్తాయ‌ని చెప్పారు.

6. మ‌లానా ఖాన్‌

6. మ‌లానా ఖాన్‌

ముంబ‌యిలోని ఖ‌రీదైన ప్రాంతాల్లో లోఖండ్వాలా ఒకటి. ఇక్క‌డ ఎంతో మంది యాక్ట‌ర్లు సెల‌బ్రిటీలు ఉంటారు. ఇదే ఏరియాలో మ‌లానా ఖాన్ త‌న వృత్తిని కొన‌సాగిస్తున్నారు. అత‌ని ఫ్రెండ్స్‌లో ఈయ‌న మ‌స్సూగా ఫేమ‌స్. ఉద‌యం 8కి ఇంటి నుంచి బ‌య‌ట‌కొచ్చే ఈయ‌న దాదాపు ముంబ‌యి నైట్ లైఫ్ ముగిసే వ‌ర‌కూ రోడ్డు మీదే ఉంటార‌ట‌.

అంధేరి వెస్ట్ ఏరియాలో ఈయ‌న‌కు సొంత ఫ్లాట్ ఉంది. దాదాపు ప్ర‌తి రోజు ఈయ‌న రూ.1000 సంపాదిస్తారు.ఎక్కువ‌గా ఆ ఏరియాల్లో ప‌బ్, రెస్టారెంట్ల‌కు వ‌చ్చే వారిని ఆయ‌న యాచిస్తారు.

7. భ‌ర‌త్ జైన్

7. భ‌ర‌త్ జైన్

ముంబ‌యిలోని చ‌త్ర‌ప‌తి శివాజి ఏరియాలో భ‌ర‌త్ జైన్ నివాసం ఉంది. దేశంలోనే ఒక భిన్న‌మైన బిచ్చ‌గాడు. అత‌ని సంప‌ద గురించి దేశంలోని చాలా ప్ర‌ముఖ మ్యాగ‌జైన్లు, పత్రిక‌ల‌లో లెక్క‌లేన‌న్ని వార్త‌లు వ‌చ్చాయంటే అత‌ని ప్రాముఖ్య‌త ఏంటో గుర్తించొచ్చు. నెల‌కు క‌నీసం రూ.75వేలు సంపాదిస్తార‌ట‌. దాంతో ఆయ‌న ఈ వృత్తిని వ‌ద‌ల్లేక‌పోతున్నార‌ట‌. ఇదే విష‌యం కుటుంబం మొత్తం ఇదే వృత్తిలోకి వ‌చ్చేలా చేసింది. అయితే కుటుంబం స్ట‌డీ మెటీరియ‌ల్‌, బ‌డి పుస్త‌కాలు అమ్మే వ్యాపారంలో ఉండ‌టంతో ఈ వృత్తి మానేద్దామ‌ని ఆయ‌న్ను బ‌తిమ‌లాడార‌ట‌. అయితే అందుకు భ‌ర‌త్ నిరాక‌రించాడ‌ని చెబుతారు.

ఈయ‌న‌కు పారెల్ ఏరియాలో రూ.80 ల‌క్ష‌ల విలువైన రెండు అపార్ట్‌మెంట్లు ఈయ‌న సొంతానివి ఉన్నాయి.

8. ముగింపు

8. ముగింపు

ఒక్క భారత్ లోనే కొన్న లక్షలాది మంది బిలీనియర్ బెగ్గర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లి బిక్షాటన చేస్తారు. అలా వచ్చిన డబ్బులతో తమ పర్మినెంట్ ప్లేస్ లో ఇళ్లు, విలాసవంత మైన భవనాలు ఏర్పరుచుకుంటారని తేలింది. అంతే కాదు వీరిలో సీజనల్ యాచకూలు కూడా ఉంటారంటా వాళ్లు పండగటైంలో యాచిస్తారు. మరో రకం బిచ్చగాళ్లు ముంబై, హైదరాబాద్, కోల్ కతా వంటి నగరాల కూడళ్లలో పిల్లల్ని చేతబట్టుకొని యాచిస్తారు. ఆ పిల్లలకు కూడా గంటల చొప్పున డబ్బు చెల్లిస్తారు. పిల్లల్ని వెంట తెచ్చుకోవడం వల్ల రోజు వారి సంపాదనకంటే ఎక్కువ మొత్తంలో అర్జిస్తారట. వాళ్లు రాని పక్షంలో పిల్లల్ని చిత్ర హింసలకు గురిచేస్తారని పోలీసుల విచారణ లో వెల్లడైంది.

భార‌త‌దేశంలో ఎక్కువ వేత‌నాలు వ‌చ్చే ఉద్యోగాలు

భార‌త‌దేశంలో ఎక్కువ వేత‌నాలు వ‌చ్చే ఉద్యోగాలు

భార‌త‌దేశంలో ఎక్కువ శాలరీలు వ‌చ్చే ఉద్యోగాలు,వృత్తులు

మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి 10 మంచి పెట్టుబ‌డులు

మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి 10 మంచి పెట్టుబ‌డులు

మధ్య‌త‌ర‌గ‌తి వాళ్లు ఈ 10 పెట్టుబ‌డుల్లో పెడితే సంప‌న్నుల‌వ్వ‌డం ఖాయం

Read more about: beggars, rich
English summary

7 richest beggars in India

some richest beggars in India and their earnings and properties they own
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns