ముఖ్యంగా వినియోగదారు వస్తువులైన చాకొలేట్లు, చూయింగ్ గమ్, శాంపూ, డియోడ్రెంట్, షూ పాలిస్, డిటర్జెంట్లు, నూట్రిషన్ డ్రింకులు, మార్బుల్, కాస్మొటిక్స్ వంటివి ఇకపై 18% జీఎస్టీ అమలవుతుంది.
జీఎస్టీలో ఇంతకుముందు అత్యధిక శ్లాబు రేటు(28%)లో 227 వస్తువుల సంఖ్యను ఇకపై 50కే తగ్గించనున్నారు. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ సభ్యుడు, బీహార్ ఆర్థికమంత్రి సుశీల్ మోదీ వెల్లడించారు. ముఖ్యంగా వినియోగదారు వస్తువులైన చాకొలేట్లు, చూయింగ్ గమ్, శాంపూ, డియోడ్రెంట్, షూ పాలిస్, డిటర్జెంట్లు, నూట్రిషన్ డ్రింకులు, మార్బుల్, కాస్మొటిక్స్ వంటివి ఇకపై 18% జీఎస్టీ అమలవుతుంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మీ కోసం...

1.జీఎస్టీ నెట్వర్క్ ప్యానెల్ అధ్యక్షుడు
సుశీల్ మోదీ జీఎస్టీ నెట్వర్క్ పానెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అస్సాంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ఆయన జీఎస్టీ పన్ను రేట్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. శాంపూ, డియోడ్రెంట్, టూత్‌పేస్ట్, సేవింగ్ క్రీమ్, ఆఫ్టర్ సేవ్ లోషన్; షూ పాలిస్, చాకొలేట్లు, చూయింగ్ గమ్, నూట్రిషన్ డ్రింక్స్ ఇకపైన తక్కువ రేట్లకు లభించనున్నాయి.

2. ఏసీ రెస్టారెంట్లలో ఆహారంపై సైతం
జీఎస్టీ రేట్ల మార్పునకు సంబంధించి అస్సాం ఆర్థిక మంత్రి హిమంతా బిస్వా శర్మ సూచనల మేరకు జీఎస్టీ సమావేశం పన్ను రేట్లలో మార్పుకు సిద్దమవుతోంది. ఏసీ రెస్టారెంట్లలో వడ్డించే ఆహారంపై సైతం పన్ను రేట్ల మార్పు 18 నుంచి 12 శాతానికి తగ్గించే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

పన్ను ఫైలింగ్‌కు సంబంధించి
3. జీఎస్టీ వచ్చిన తర్వాత వ్యాపారులు నెలకు మూడు సార్లు ఆదాయం పన్ను రిటర్నులు సమర్పిస్తున్నారు. దీనికి సంబంధించి సైతం ఫైలింగ్ సైకిల్‌ను పన్ను చెల్లింపుదార్లకు అనుగుణంగా మర్చడాన్ని కౌన్సిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

అరుణ్ జైట్లీ ఇదివరకే చెప్పారు
4. దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ వారంలో ఇంతకుముందే జీఎస్టీ 28% పన్ను శ్లాబులోంచి కొన్ని వస్తువులను తొలగించే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. కొన్ని వస్తువులు ఎప్పుడూ అత్యధిక పన్ను శ్లాబులో లేవని వాటిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. జీఎస్టీ పన్ను కలెక్షన్ల ప్రభావంపై పడకుండా పన్ను శ్లాబుల్లో వస్తు జాబితాను మారుస్తున్నామన్నారు.

ప్రతి నెలా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
5. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రతి నెలా జరుగుతోంది. దేశంలో పరోక్ష పన్నుల్లో కీలక సంస్కరణ జరిగినప్పటి నుంచి కౌన్సిల్ సమావేశం ద్వారా ప్రభుత్వం సత్వరమే నిర్ణయాలను ప్రకటిస్తోంది. జులై 1 నుంచి ఇప్పటిదాకా దాదాపు 10 వస్తువులకు సంబంధించిన పన్ను రేట్లను మార్చారు. జీఎస్టీ పన్ను రేటు అమలైన తర్వాత 5,12,18,28 అని నాలుగు రకాల ప్రధాన పన్ను శ్లాబులను ఏర్పరిచారు.

జీఎస్టీ మీద విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం సమావేశం
6. స్వాతంత్ర్యం తర్వాత చేపట్టిన అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ. దీనిపై విపక్షాలు పన్ను సంస్కరణ అమలు జరుపుతున్న తీరును విమర్శిస్తున్న నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ అస్సాం రాజధాని గౌహతిలో సమావేశమవుతోంది. జీఎస్టీ తీసుకొచ్చిన సమయం, అమలు జరుపుతున్న తీరు కారణంగా చిన్న వ్యాపారాలు, ట్రేడర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి.
Trending articles on Telugu Goodreturns

7. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న చోట నిరసనలు
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న గౌహతి హోటల్ వద్ద పలువురు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనలకు కాంగ్రెస్ నాయకుడు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌సింగ్, కర్ణాటక వ్యవసాయ మంత్రి క్రిష్ణ బైరె గౌడ నేతృత్వం వహించారు. జీఎస్టీ అమలు ప్రారంభమైన తర్వాత దేశంలో ఐదు రాష్ట్రాలకు పన్ను వసూళ్ల ద్వారా సంక్రమించే ఆదాయం తగ్గిందని ఆరోపించారు.
Image courtesy:ANI

కాంగ్రెస్ ముందే హెచ్చరించినా... గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే
8. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టింది. తాము ముందే జీఎస్టీ పన్ను రేట్ల సవరణలక సంబంధించి విన్నవించినా పెడచెవిన పెట్టారని, ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ను ఏర్పాటు చేసిందని విమర్శిస్తున్నారు. చాలా మంది చిన్న వ్యాపారులు జీఎస్టీ అమలు జరుగుతున్న తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications