టాటా మోటార్స్ ఫలితాలు: రెండో త్రైమాసికంలో రెవెన్యూలో 10% వృద్ది
సంస్థ ఏకీకృత ఆదాయంలో వృద్ది నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో నికర ఆదాయం రూ.63,577 కోట్లుండగా ఈ ఏడాది అదే త్రైమాసికంలో రూ.70,156 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది.
2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రెండో త్రైమాసికంలో టాటా మోటార్స్ మంచి ఫలితాలను వెల్లడించింది. సంస్థ ఏకీకృత ఆదాయంలో వృద్ది నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో నికర ఆదాయం రూ.63,577 కోట్లుండగా ఈ ఏడాది అదే త్రైమాసికంలో రూ.70,156 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. పన్నులకు ముందు సంస్థ ఏకీకృత నికర లాభం రూ.3081కోట్లుగా ఉంది. అందే ఇంతకుముందు ఏడాది త్రైమాసికంలో ఇది రూ.999 కోట్ల మేర ఉంది. పన్నులు, నికర లాభనష్టాల లెక్కల తర్వాత 2018 రెండో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ.2502 కోట్లుగా నమోదయింది. అదే అంతకుముందు ఏడాది రెండో త్రైమాసికంలో ఇది రూ.848 కోట్ల మేర మాత్రమే ఉంది.

మొత్తం రెవెన్యూ, ఆదాయ వివరాలు
గతేడాది ఇదే సమయానికి మొత్తం సంస్థ రెవెన్యూ రూ.1,28,692 కోట్ల వరకూ ఉండగా ఈ ఏడాది రెండో త్రైమాసికం ముగిసే సరికి సంస్థ రెవెన్యూ రూ.1,28,807 కోట్లుగా ఉంది. పన్నులకు ముందు సంస్థ మొత్తం లాభం రూ.3071 కోట్లుగా ఉంది. అందే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో పన్నులకు ముందు లాభం రూ.6818 కోట్లుగాను, పన్నులు కట్టిన తర్వాత రూ.5702 కోట్లుగా ఉంది. గతేడాది పన్నులకు ముందు, పన్నులకు తర్వాత రెండో త్రైమాసికంలో రూ.3551 కోట్లు, రూ.3109 కోట్ల లాభాన్ని టాటా మోటార్స్ ఆర్జించింది.


Click it and Unblock the Notifications