రెండు రోజుల తర్వాత మళ్లీ పైకి
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుండటంతో కొన్ని రంగాల్లో ఆశలు నెలకొనడం, టాటా మోటార్స్ మంచి ఫలితాలు వెల్లడించడం, చమురు రంగ షేర్లకకు డిమాండ్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్ల కొనుగోలుకు మదుపర్లు ఆసక్
రెండు రోజుల వరుస నష్టాల తర్వాత గురువారం మార్కెట్లు కన్సాలిడేషన్ దిశగా కదిలాయి. మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో 33,251 వద్ద ముగియగా మరో సూచీ నిఫ్టీ 6 పాయింట్లు పుంజుకుని 10,309 వద్ద నిలబడింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుండటంతో కొన్ని రంగాల్లో ఆశలు నెలకొనడం, టాటా మోటార్స్ మంచి ఫలితాలు వెల్లడించడం, చమురు రంగ షేర్లకకు డిమాండ్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్ల కొనుగోలుకు మదుపర్లు ఆసక్తిచూపడం వంటి కారణాలతో మార్కెట్లు కాస్త సానుకూలంగా కదిలాయి.
మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్లో రంగాల వారీగా చూస్తే కన్సూమర్ డ్యూరబుల్స్(3.23%), పవర్(0.62%), బ్యాంకింగ్(0.53%), లోహ రంగం(0.48%) మేర లాభపడగా, మరో వైపు హెల్త్‌కేర్(0.27%), ఆటో(025%), ఎఫ్ఎంసీజీ(0.06%), చమురు,సహజ వాయు రంగం(0.03%) వంటి రంగాలు నష్టాలకు లోనయ్యాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన కంపెనీల షేర్ల వివరాలిలా ఉన్నాయి. భారతీ ఎయిరటెల్(2.39%), ఏసియన్ పెయింట్స్(2.08%), ఐసీఐసీఐ బ్యాంక్ (+ 1.9 శాతం), టాటాస్టీల్ (+ 1.66 శాతం), రిలయన్స్ (1.5 శాతం) లాభపడ్డాయి. అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఐటీసీ (-2.00%),కోల్ ఇండియా(1.7%), ఓఎన్జీసీ (-1.33%), లూపిన్ (-1.24%), హెచ్‌డీఎఫ్‌సి (-1.21%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications