నోట్ల రద్దు వల్ల దేశానికి ఏం ఒరుగుతోందో తెలియదు కానీ చిన్న వ్యాపారాలు చితికిపోయాయి. అంతే కాకుండా స్వల్పకాలంలో ఆర్థిక వ్యవస్థలో వృద్ది కుంటుపడింది. నోట్ల రద్దుతో లక్షల కోట్ల నల్ల ధనం ఖజానాకి చే
నోట్ల రద్దు వల్ల దేశానికి ఏం ఒరుగుతోందో తెలియదు కానీ చిన్న వ్యాపారాలు చితికిపోయాయి. అంతే కాకుండా స్వల్పకాలంలో ఆర్థిక వ్యవస్థలో వృద్ది కుంటుపడింది. నోట్ల రద్దుతో లక్షల కోట్ల నల్ల ధనం ఖజానాకి చేరుతుందని ప్రభుత్వం చెప్పినా... వాస్తవానికి సర్కారుకే ఖర్చు తడిసి మోపెడయ్యింది. నోట్ల రద్దుతో ప్రభుత్వానికి రూ.16,000 కోట్ల లాభం రాగా, రూ.2 లక్షల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. అదేంటి ప్రభుత్వం నోట్ల మార్పిడి(రద్దు) కారణంగా వ్యవస్థకు ఎంతో ప్రయోజనం కలిగిందని చెబుతోంది కదా అంటారా... అయితే ఈ కథనం చదవండి.

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం రద్దు చేసేనాటికి చెలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు. దాన్లో రూ.15.28 లక్షల కోట్లు బ్యాంకు ఖాతాల్లో వచ్చి పోగయ్యాయి. దీంతో రూ.16,000 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు మిగిలినట్లు లెక్క. కానీ తొలుత ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేస్తే 13 నుంచి 14 లక్షల కోట్లు మాత్రమే వెనక్కొస్తాయని, కనీసం రెండు లక్షల కోట్లు మిగులుతాయని అంచనా వేసింది.
వ్యయం రూ. 30,000 కోట్లపైనే..
పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను ప్రవేశపెట్టడం ఆర్‌బీఐకి తలకు మించిన భారమయింది. రద్దయిన పాత నోట్లను స్వీకరించి, వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టడం, రవాణా, కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలను రీ కాలిబ్రేషన్ చేయడం కోసం సుమారు రూ.30,000 కోట్లు ఖర్చయినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ముద్రణా వ్యయం రెట్టింపయి రూ.7,965 కోట్లకు చేరింది. ఖర్చు పెరిగింది కనక ప్రభుత్వానికిచ్చే డివిడెండ్‌లో ఆర్‌బీఐ రూ.35,221 కోట్లు కోతపెట్టింది. ఇవికాక నోట్ల రద్దు, డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రూ.10,000 కోట్లపైనే ఖర్చు చేశాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications