1 శాతానికి పైగా నష్టపోయిన స్టాక్ మార్కెట్ సూచీలు
స్థానికంగా నెగటివ్ సంకేతాలతో పాటు అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయింది.
సోమవారం బాగా లాభపడిన మార్కెట్లు మంగళవారం దాదాపు 1 శాతం వరకూ నష్టపోయాయి. స్థానికంగా నెగటివ్ సంకేతాలతో పాటు అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు ట్రేడింగ్‌లో నష్టపోయింది. పీఎస్‌యూ రంగానికి చెందిన బ్యాంకు షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం కూడా మరో విధంగా నష్టాలకు కారణమైంది. మొత్తానికి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 360 పాయింట్లు దిగజారి 33,371 వద్ద మరో సూచీ నిఫ్టీ 102 పాయింట్లు క్షీణించి 10,350 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో రంగాల వారీగా చూస్తే హెల్త్‌కేర్(3.51%), స్థిరాస్తి(2.24%), కన్సూమర్ డ్యూరబుల్స్(2.03%), పీఎస్‌యూ(1.92%) లాభపడగా మరో వైపు ఐటీ(2.06%), టెక్నాలజీ(1.21%) రంగాలు నష్టపోయాయి.

బీఎస్ఈలో లాభపడ్డ, నష్టపోయిన స్టాకుల వివరాలు ఇలా ఉన్నాయి. లుపిన్(16.84%), సిప్లా(7.18%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(3.57%), భారతీ ఎయిర్టెల్(3.45%), రిలయన్స్(2.98%) ఎక్కువగా నష్టపోయిన వాటిలో ఉండగా, మరో వైపు ఇన్ఫోసిస్(2.92%), టీసీఎస్(1.55%), విప్రో(0.87%), కొటక్ బ్యాంక్(0.33%), ఐటీసీ(0.2%) లాభపడన వాటిలో ఉన్నాయి.
లుపిన్ షేర్ 17% దిగువకు
దేశీయ ఫార్మా రంగ దిగ్గజం ఒక్కసారిగా మార్కెట్లో కుదుపునకు గురైంది. ఆ కంపెనీకి చెందిన గోవా, పితంపూర్(ఇండోర్) ప్లాంట్లకు సంబంధించి యూఎస్ఎఫ్‌డీఏ ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆ కంపెనీ షేర్ భారీగా ప్రభావితమైంది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సరికి దాదాపు 17% నష్టపోయింది. 3.19 సమయానికి ఈ సంస్థ షేర్ 174 పాయింట్లు దిగజారింది. 16.86% నష్టపోయిన షేర్ 860.10 వద్ద స్థిరపడింది. దాదాపు ఈ ఒక్క రోజులోనే ఈ సంస్థ షేర్ 174.45 విలువను కోల్పోయింది.


Click it and Unblock the Notifications