అమెరికాలో నిరుద్యోగ రేటు 4.1%, 17 ఏళ్ల కనిష్టం
అక్టోబర్ నెలకు అమెరికా దేశ నిరుద్యోగిత రేటు 17 ఏళ్ల కనిష్టానికి చేరింది. తమ పాలసీలు బాగా పనిచేస్తున్నాయని అందుకే నిరుద్యోగ రేటు తగ్గిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు.
అక్టోబర్ నెలకు అమెరికా దేశ నిరుద్యోగిత రేటు 17 ఏళ్ల కనిష్టానికి చేరింది. తమ పాలసీలు బాగా పనిచేస్తున్నాయని అందుకే నిరుద్యోగ రేటు తగ్గిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. కార్మిక శాఖ నెలవారీ వెల్లడించే గణాంకాల ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. నిజానికి గత ఎండాకాలం తర్వాత అమెరికాలో వరుసగా రెండు హుర్రికేన్లు రావడంతో వృద్ది మందగించి నిరుద్యోగిత రేటుపైన తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా వేసినా దానికి భిన్నంగా జరిగింది. అయితే ఇప్పుడు విడుదలైన నిరుద్యోగిత సమాచారం కొంత వరకూ పైకి బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా క్రితం ఏడాది ఒబామా పాలనలో ఉన్నదాని కంటే నిరుద్యోగిత రేటు ఎక్కువగానే ఉండటం గమనార్హం.

సెప్టెంబరు కంటే 0.10 శాతం తగ్గి అక్టోబర్ నెలకు నిరుద్యోగిత రేటు 4.10%గా నమోదయింది. ఇది డిసెంబరు 2000 తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థకు అత్యల్ప నిరుద్యోగిత రేటు కావడం విశేషం. హుర్రికేన్ల తర్వాత వ్యాపారాలన్నీ సజావుగా ప్రారంభమవడంతో కొత్తగా 2,61,000 ఉద్యోగులను నియమించుకున్నారు. అయితే ఆర్థికవేత్తలు మాత్రం కనీసం 3 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు. ఈ అంకెలను చూస్తే కార్మిక మార్కెట్లో పరిస్థితులు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications