పంజాబ్ నేషనల్ బ్యాంకు త్రైమాసిక ఫలితాల్లో సానుకూలత
త్రైమాసిక ఫలితాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) ఫర్వాలేదనిపించింది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభంలో 2.2% వృద్దితో సెప్టెంబరు త్రైమాసికంలో సానుక
త్రైమాసిక ఫలితాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) ఫర్వాలేదనిపించింది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభంలో 2.2% వృద్దితో సెప్టెంబరు త్రైమాసికంలో సానుకూల ఫలితాలను వెల్లడించింది.ఈ ఏడాది రెండో త్రైమాసికానికి గాను రూ.561 కోట్ల నికర లాభాన్ని చూపించింది. అదే సమయంలో మొత్తం ఆదాయం రూ.13,639 కోట్ల నుంచి రూ.14,205 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. నిర్వహణ లాభం రూ.2732 కోట్ల నుంచి 20% వృద్దితో రూ.3279 కోట్లకు పెరిగినట్లు బ్యాంకు సీఎండీ సునీల్ మెహతా వెల్లడించారు.

ఈ బ్యాంకు మొండి బకాయిల కోసం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రూ. 2693.78 కోట్ల మేర కేటాయింపులు చేసింది. అదే త్రైమాసికం క్రితం ఏడాది కేవలం రూ.1954.14 కోట్ల మేర మాత్రమే వసూలు కాని రుణాల కోసం కేటాయించారు. ఈ విధంగా స్థూల ఎన్‌పీఏ బకాయిలు రూ.57,630 కోట్ల నుంచి 13.31శాతం తగ్గి రూ.56,406 కోట్లకు తగ్గాయని బ్యాంకు ఫలితాల్లో వెల్లడైంది.
దీంతో బ్యాంకుకు అనవసరంగా చేయాల్సిన కేటాయింపులు బాగా పెరిగినట్లు తెలుస్తోంది. అంతకుముందు త్రైమాసికంలో ఇవి రూ.6649 కోట్లుండగా ఈ సారి సైతం రూ.3500 కోట్ల మేరకు బ్యాంకు నిధులు వృథా అయినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు సీఈవో,ఎండీ సునీల్ చెప్పారు. వడ్డీల ద్వారా సంక్రమించే ఆదాయం అంతకు ముందు త్రైమాసికంలో ఉన్న 2.56% నుంచి స్వల్పంగా పెరిగి 2.62%గా నమోదయింది.


Click it and Unblock the Notifications