For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ‌న‌వ‌రి నుంచి బంగారు ఆభ‌ర‌ణాల‌కు హాల్‌మార్కింగ్ త‌ప్ప‌నిసరి

వినియోగ‌దారు కొనుగోలు చేసే ప్ర‌తి బంగారు ఆభ‌ర‌ణం నాణ్య‌త‌ను తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, అందుకోసం కేంద్రం హాల్‌మార్కింగ్‌ను త‌ప్ప‌నిస‌రి చేసేలా నిబంధ‌న‌ల‌ను మారుస్తోంద‌ని కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ

|

వినియోగ‌దారు కొనుగోలు చేసే ప్ర‌తి బంగారు ఆభ‌ర‌ణం నాణ్య‌త‌ను తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, అందుకోసం కేంద్రం హాల్‌మార్కింగ్‌ను త‌ప్ప‌నిస‌రి చేసేలా నిబంధ‌న‌ల‌ను మారుస్తోంద‌ని కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం వ్యాపారుల వ‌ద్ద బంగారం కొంటున్న ప్ర‌జ‌లు ఏ రక‌మైన బంగారం కొంటున్నారో, అది న‌కిలీదో కాదో తెలుసుకునేందుకు పూర్తిగా అవ‌కాశాల్లేవు. కొంత మంది నాణ్య‌త‌ను క‌నుక్కోలేకుండా ఉన్నారు. ఇక‌పై బంగారు అమ్మ‌కందార్లు ఆభ‌ర‌ణాల‌పై కేవ‌లం హాల్‌మార్క్ విలువ‌నే కాకుండా, అది ఎన్ని కారెట్ల‌తో త‌యారైందనే విష‌యాన్ని కూడా ముంద్రించాల్సి ఉంటుంద‌ని పాశ్వాన్ చెప్పారు. శుక్ర‌వారం ప్ర‌పంచ ప్ర‌మాణాల దినోత్స‌వం సంద‌ర్భంగా ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు.

 ఇక‌పై హాల్‌మార్క్ త‌ప్ప‌నిస‌రి

వినియోగ‌దారు వ్య‌వ‌హారాల శాఖ బీఐఎస్ చ‌ట్టం, 2016 కింద హాల్‌మార్కింగ్ నిబంధ‌న‌లు రూపొందించే ప‌నిలో ఉంద‌ని మంత్రి తెలిపారు. నిబంధ‌న‌ల మార్పు కార‌ణంగా దేశంలో కేవ‌లం 14,18,22 కారెట్ల బంగారాన్ని మాత్ర‌మే అమ్మేందుకు వీల‌వుతుంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం బంగారం అమ్మే దుకాణాల్లో చాల ర‌కాల కారెట్ల పేరుతో విక్ర‌యాలు సాగుతున్నాయి. ఈ త‌ప్ప‌నిస‌రి హాల్‌మార్కింగ్‌ను జ‌న‌వ‌రి నుంచి అమ‌లు చేసేలా త‌మ అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు మంత్రి చెప్పారు.

Read more about: gold hall mark
English summary

జ‌న‌వ‌రి నుంచి బంగారు ఆభ‌ర‌ణాల‌కు హాల్‌మార్కింగ్ త‌ప్ప‌నిసరి | Hallmarking of gold jewellery to be made compulsory from Jan

“All gold products to be sold in India should be under Hallmarking regulations from January next year. As most Indians understand purity of gold in terms of carat, gold ornaments bear not just the Hallmarking value (such as 916 or 958) but also their carat value too,” Union Minister for Consumer Affairs Ram Vilas Paswan told reporters on the sidelines of a seminar to mark World Standards Day here on Friday.
Story first published: Saturday, November 4, 2017, 16:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X