జాబితాలో ఐసిఐసిఐ సిఇఓ చందా కొచ్చర్, నటి ప్రియాంక చోప్రా, హెచ్‌సిఎల్ సిఇఓ రోష్నీ మల్హోత్రా, బయోకాన్ సంస్థాపకురాలు కిరణ్ మజుందార్ ఉన్నారు. వారిలో ఒక్కక్కరి గురించి తెలుసుకుందాం.
శక్తిమంతమైన మహిళలుగా మన భారతీయ మహిళలుఈ ఏటా వారి హవా కొనసాగించారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచ వ్యాప్తంగా భిన్న రంగాలకు చెందిన వంద మందిని ఎంచుకోగా అత్యంత ప్రభావం చూపే మహిళలల్లో ఐదుగురు భారతీయ నారీమణులకు స్థానం దక్కింది. వీరిలో ఐసిఐసిఐ సిఇఓ చందా కొచ్చర్, నటి ప్రియాంక చోప్రా, హెచ్‌సిఎల్ సిఇఓ రోష్నీ మల్హోత్రా, బయోకాన్ సంస్థాపకురాలు కిరణ్ మజుందార్ ఉన్నారు. వారిలో ఒక్కక్కరి గురించి తెలుసుకుందాం.

జాబితాలో మన దేశం నుంచి 5 మంది మహిళలు
ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోనే శక్తిమంతమైన నారీమణుల జాబితాలో భారత్ నుంచి 5 మంది మహిళలు చోటు దక్కించుకున్నారు. చందా కొచ్చర్ జాబితాలో భారత్ నుంచి ప్రథమ స్థానాన్ని అలరించగా, ఇంకా నలుగురు ఒకరు టెక్ దిగ్గజం, మరొకర్ బయోటెక్ దిగ్గజం, బాలీవుడ్ సినీ నటి మరొకరు ఉన్నారు. ఒకరు మీడియా నుంచి సైతం ఉండటం విశేషం.

చందా కొచ్చర్
దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు, ప్రపంచంలోనే ప్రైవేటు బ్యాంకుల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్న చందా కొచ్చర్ జాబితాలో 32వ స్థానంలో నిలిచారు.

రోషిణి మల్హోత్రా
రోషిణి నాడర్ మల్హోత్రా(35) హెచ్‌సీఎల్ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమె హెచ్‌సీఎల్ వ్యవస్థాకులైన శివ్ నాడర్ ఏకైక తనయ. ఫోర్బ్స్ జాబితాలో శక్తిమంతమైన మహిళల్లో 57వ స్థానాన్ని దక్కించుకోవడం ఈ ఏడాది విశేషం.

కిరణ్ మజుందార్ షా
ఎప్పటిలాగే దేశం నుంచి శక్తిమంతమైన మహిళల జాబితా ఎప్పుడు తయారుచేసినా వినిపించే పేరిది. దేశంలోనే శక్తిమంతమైన బయోటెక్ కంపెనీని నిర్మించిన బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా 64 వ స్థానంలో నిలిచారు.

శోభనా భార్తియా
1957లో జన్మించిన శోభనా భర్తియా హిందుస్థాన్ టైమ్స్ మీడియా గ్రూప్‌కు ఎడిటోరియల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యే బిట్స్ పిలానీ ప్రొ చాన్సలర్ బాధ్యతలను సైతం తీసుకున్నారు. 2006 నుంచి 2012 వరకూ రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. శోభనా భార్తియా 92వ స్థానంలో ఉన్నారు.

ప్రియాంకా చోప్రా
ప్రియాంకా చోప్రా అనే పేరు తెలియని యువత భారత్‌లో ఉండదేమో అంటే అతిశయోక్తి కాదు. తన నటన ద్వారా అంత ప్రభావాన్ని చూపారు. ఒకప్పుడు బాలీవుడ్‌లోనే కాదు.. ప్రస్తుతం హాలీవుడ్లో సైతం ఈమె విజయవంతంగా దూసుకెళుతున్నది.
2003లో బాలీవుడ్లోకి అడుగుడిన ఆమె మొత్తం 50 సినిమాల వరకూ చేసి ఉంటారు. తనలో ఉన్న సేవా దృక్పథంతో యునిసెఫ్‌తో చేయి కలిపి పిల్లల హక్కుల కోసం పోరాటం చేస్తోంది. యూఎస్ ఫౌండేషన్‌కు చెందిన గర్ల్ అప్ ప్రచారం కార్యక్రమంలో పాల్గొంటూ బాలికల ఉన్నతికి పాటుపడుతోంది. 100 మందిలో ప్రియాంక 97వ శక్తిమంతమైన మహిళగా చోటు దక్కించుకున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications