మార్కెట్లు ముగిసే సరికి 112.34 పాయింట్లు పుంజుకొని 33,685.56 వద్ద ముగియగా,మరో సూచీ నిఫ్టీ 28.70 పాయింట్లు పైకి ఎగసి 10,452.50 పాయింట్ల వద్ద స్థిరపడింది.
కొత్త మూలధనం నిధులు రావడంతో పాటు, పీఎంఐ సమాచారం సానుకూలంగా ఉండటంతో మార్కెట్లు ఈ రోజు ట్రేడింగ్‌లో సైతం సానుకూలంగా దూసుకెళ్లాయి. దీంతో మార్కెట్లు మళ్లీ సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. దీంతో మార్కెట్ ట్రేడింగ్ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో ఇంట్రా డే గరిష్టం 33,733.71 పాయింట్లను తాకి, గత రికార్డు 33,657ను దాటేసింది. మార్కెట్లు ముగిసే సరికి 112.34 పాయింట్లు పుంజుకొని 33,685.56 వద్ద ముగియగా,మరో సూచీ నిఫ్టీ 28.70 పాయింట్లు పైకి ఎగసి 10,452.50 పాయింట్ల వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సూచీలో రంగాల వారీగా చూస్తే మూలధన వస్తువులు(1.09%), బ్యాకింగ్(1.00%), పీఎస్‌యూ(0.64%), స్థిరాస్తి(0.37%) మొదలైన రంగాలు సానుకూలంగా సాగాయి. మరో వైపు హెల్త్ కేర్(0.56%), పవర్(0.35%), చమురు,సహజ వాయువు(0.16%), లోహ రంగాలు నెగటివ్ దిశగా కదలాయి.
సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(3.19%), టాటా మోటర్స్ (+ 2.78%), ఎల్ అండ్ టి (+ 1.98%), యాక్సిస్ బ్యాంక్ (+ 1.87%), ఒఎన్జిసి (+ 1.78%) ముందుండగా మరో వైపు పెద్దగా నష్టపోయిన వాటిలోపవర్ గ్రిడ్(2.05%), సన్ ఫార్మా(1.95%), కోల్ఇండియా(1.73%), హీరో మోటోకార్ప్ (-1.23%), లూపిన్ (1.1%) మొదలైనవి ఉన్నాయి.


Click it and Unblock the Notifications