రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ
గృహ రుణాలు, ఆటోమొబైల్ రుణాలకు సంబంధించి వినియోగదారులు తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లను 0.05% మేర తగ్గించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
దేశ అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. గృహ రుణాలు, ఆటోమొబైల్ రుణాలకు సంబంధించి వినియోగదారులు తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లను 0.05% మేర తగ్గించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇప్పటి వరకూ తగ్గించిన వడ్డీ రేట్ల ద్వారా చూస్తే గృహ రుణాలపై వడ్డీ రేట్లను 8.30% వరకూ తగ్గించినట్లు దేశంలోనే అగ్రగామి బ్యాంకు పేర్కొంది. అదే విధంగా వాహన రుణాల విషయంలో వడ్డీ రేట్లను ఇంతకుముందున్న 8.75% నుంచి 0.05% తగ్గించి 8.70%గా నిర్ణయించింది. అర్హత కలిగిన ఉద్యోగస్థులందరికీ ఈ కొత్త వడ్డీ రేట్లతో అప్పు లభిస్తుందని ఎస్బీఐ వెల్లడించింది.

ముఖ్యంగా గృహ రుణాల విషయంలో రూ.30 లక్షల లోపు తీసుకునే వారికి వార్షికంగా 8.30% వడ్డీ రేట్ అమలవుతుంది. వాహనాలు(ఆటోమొబైల్స్) కొనుక్కునే వారు తీసుకునే రుణాల వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా 8.70% నుంచి 9.20% మధ్య ఉంటాయని బ్యాంకు తెలిపింది. ఈ తరహా రుణ వడ్డీ రేట్లు ఇంతకు ముందు 8.75% నుంచి 9.25% మధ్య ఉన్నాయి. అయితే కచ్చితంగా ఏ వినియోగదారుకు ఎంత వడ్డీ రేటు విధిస్తారనే విషయం ఆ వ్యక్తి క్రెడిట్ స్కోర్ ఆధారంగా నిర్ణయమవుతుందని స్టేట్ బ్యాంక్ పేర్కొంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications