స్వల్ప నష్టంలో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పాటు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబరులో వడ్డీ రేట్ల మార్పుంటుందన్న సంకేతాలను ఇవ్వడంతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పాటు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబరులో వడ్డీ రేట్ల మార్పుంటుందన్న సంకేతాలను ఇవ్వడంతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ అయిపోయేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 27.05 పాయింట్లు కోల్పోయి 33,573.22 వద్ద, నిఫ్టీ 16.7 పాయింట్లు క్షీణించి 10423.80 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే హెల్త్‌కేర్(2.48%), కన్సూమర్ డ్యూరబుల్స్(1.26%), పవర్(0.34%), ఐటీ(0.3%) లాభపడగా; మరో వైపు ఎఫ్ఎంసీజీ(0.93%), ఆటో(0.61%), చమురు,సహజ వాయువు(0.34%), లోహ రంగం(0.3%) నష్టపోయాయి.

అరబిందో ఫార్మా(3.67%), లుపిన్(3.22%),సన్ ఫార్మా (+ 2.69%), పవర్గ్రిడ్ (+ 2.31%), డాక్టర్ రెడ్డీస్ (2.43%) ఉండగా నష్టపోయిన వాటిలో టెక్ మహీంద్రా(4.21%), హీరో మోటోకార్ప్(2.19%), భారతీ ఇన్‌ఫ్రాటెల్(1.85%), ఎస్‌బీఐ(1.72%), హిందాల్కో(1.63%) ముందు ఉన్నాయి.


Click it and Unblock the Notifications