సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, బ్యాంకులు, మౌలిక సదుపాయాల రంగాలకు కేంద్ర ప్రభుత్వం గత వారం ప్రకటించిన భారీ పెట్టుబడి ప్రణాళికలు దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నెలకొల్పేందుకు తోడ్పడ్డాయి.
సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, బ్యాంకులు, మౌలిక సదుపాయాల రంగాలకు కేంద్ర ప్రభుత్వం గత వారం ప్రకటించిన భారీ పెట్టుబడి ప్రణాళికలు దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నెలకొల్పేందుకు తోడ్పడ్డాయి. ఉదయం ట్రేడింగ్ మొదలైన దగ్గర నుంచి పటిష్ట లాభాలతో కదిలిన మార్కెట్లు చివరికి సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 109 పాయింట్లు పెరిగి 33,266 వద్ద నిలవగా.. నిఫ్టీ 41 పాయింట్లు పుంజుకొని 10,364 వద్ద స్థిరపడింది. ఉదయం సెషన్‌లో 33,332 పాయింట్ల వద్ద సెన్సెక్స్.. 10,383 వద్ద నిఫ్టీ కొత్త ఇంట్రాడేలోనూ కొత్త రికార్డులను నెలకొల్పాయి.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ,లోహ రంగాలు తప్ప మిగిలినవన్నీ లాభాల్లో పయనించాయి. అందులో వినియోగదారు వస్తువులు(2.39%), స్థిరాస్తి(2.06%), చమురు, సహజ వాయు రంగం(1.1%), మౌలిక రంగం(1.1%) లాభపడ్డాయి. మరో వైపు ఎఫ్ఎంసీజీ(0.42%), లోహ(0.17%)రంగాలు నష్టాలతో ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన వాటి షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి. బాగా లాభపడిన వాటిల్లో లుపిన్(2.67%), ఓఎన్జీసీ(1.69%), భారతీ ఎయిర్టెల్ (+ 1.59%), డాక్టర్ రెడ్డీస్ (+ 1.57%), టాటా మోటార్స్ (+ 1.34%) ఉండగా, భారీగా నష్టపోయిన వాటిలో హెచ్‌యూఎల్ (-1.71%), ఐటిసి(-1.56%), టాటా స్టీల్(-1.03%), విప్రో (-0.98%), ఎం అండ్ ఎం (-0.83 శాతం) ముందున్నాయి.


Click it and Unblock the Notifications