సెప్టెంబర్ త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ లాభం అంచనాలను మించి రాణించింది. రుణవృద్ధి బలంగా ఉండడం, నికర వడ్డీ మార్జిన్లు మంచి పెరుగుదల నమోదుచేయడంతో ఫలితాలు అదరగొట్టాయి.
సెప్టెంబర్ త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ లాభం అంచనాలను మించి రాణించింది. రుణవృద్ధి బలంగా ఉండడం, నికర వడ్డీ మార్జిన్లు మంచి పెరుగుదల నమోదుచేయడంతో ఫలితాలు అదరగొట్టాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 15 శాతం పెరిగి 2,100కోట్ల రూపాయలకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 13.6 శాతం పెరుగుదలతో 2,612 కోట్ల రూపాయలకు చేరగా, నికర వడ్డీ మార్జిన్లలో 3.9 శాతం వృద్ధి నమోదయింది. రాబోయే త్రైమాసికాల్లో కూడా ఎన్‌ఐఎం బాగుంటుందని అంచనా వేస్తున్నట్లు కంపెనీ సీఈఓ కేకి మిస్త్రీ చెప్పారు. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభంలో 17% పెరుగుదల సంభవించింది.

జులై-సెప్టెంబరు మధ్య కాలంలో కంపెనీ లోన్‌బుక్‌లో 18 శాతం వృద్ధి కనిపించింది. స్థూల ఎన్‌పీఎల్లో 1.14 శాతం పెరుగుదల నమోదయింది. మొత్తం మొండిపద్దుల్లో రిటైలర్ల వాటా 0.65 శాతం కాగా కార్పొరేట్ మొండిపద్దుల వాటా 2.18 శాతమని మిస్త్రీ చెప్పారు. మొండిబకాయిల కేటాయింపులో 10 కోట్ల పెరుగుదల కనిపించింది. ఫలితాలు బాగుండడంతో హెచ్‌డీఎఫ్‌సీ షేర్ ఈ రోజు ట్రేడింగ్‌లో బాగా లాభపడ్డది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్-మాక్స్ విలీనం గురించి మాట్లాడుతూ సంస్థ ఇంకా ఇతర విలీన అవకాశాల కోసం ఎదురుచూస్తుందని మిస్త్రీ వెల్లడించారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications