హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఐపీవో నవంబరు 7న
ప్రైవేటు బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వచ్చే నెలలో ఐపీవోకి రానుంది. పబ్లిక్ ఇష్యూ కోసం ఒక్కో షేర్‌కు ధరల శ్రేణిని రూ.275- రూ.290గా ప్రకటించింది.ఈ ఐపీవోలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సంస్థలో హెచ్
ప్రైవేటు బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వచ్చే నెలలో ఐపీవోకి రానుంది. పబ్లిక్ ఇష్యూ కోసం ఒక్కో షేర్‌కు ధరల శ్రేణిని రూ.275- రూ.290గా ప్రకటించింది.ఈ ఐపీవోలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సంస్థలో హెచ్‌డీఎఫ్‌సీకి ఉన్న 9.55 శాతం వాటాకు సమానమైన షేర్లను మార్కెట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇంకా హెచ్డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ మారిషస్‌కు చెందిన 5.42శాతం వాటా 10.8 కోట్ల షేర్లను సైతం విక్రయించనున్నారు. కంపెనీలో హెచ్డీఎఫ్‌సీకి 61.10%, స్టాండర్డ్ లైఫ్‌కు మిగిలిన వాటా ఉంది.

నవంబరు 6న యాంకర్ ఇన్వెస్టర్లు బిడ్లు దాఖలు చేస్తారని, 7-9 తేదీల్లో పబ్లిక్ ఇష్యూ ఉంటుందని కంపెనీ తెలిపింది. షేర్ ముఖ విలువ రూ.10 కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లు 50 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా సబ్‌స్క్రైబ్ చేయాలంటే రూ.2 లక్షలకు మించకుండా ఏకమొత్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కెట్ ద్వారా నిధుల సేకరణ చేసి లబ్దిపొందేందుకు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ అనే బీమా వ్యాపార నిర్వహణ సంస్థ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. తద్వారా కంపెనీ ఈక్విటీ షేర్లను స్టాక్ ఎక్స్చేంజీలో ఈ కంపెనీ నమోదు చేస్తుంది. ఈ ఇష్యూకు లీడ్ మేనేజర్లుగా మోర్గాన్ స్టాన్లీ,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, క్రెడిట్ సూయిజ్, నొమురా వ్యవహరిస్తున్నాయి.


Click it and Unblock the Notifications