సెన్సెక్స్ లాభం, నిఫ్టీ నష్టం
ఈ రోజు ట్రేడింగ్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 10 పాయింట్లు లాభపడి 33,157 వద్ద ముగియగా మరో సూచీ నిఫ్టీ 20.75 పాయింట్లు తగ్గి 10323.05 వద్ద స్థిరపడింది.
వారంతం ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సానుకూలంగానే సాగింది. మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ దాదాపు 0.03% లాభపడింది. గురువారం రికార్డు ముగింపులను నమోదు చేసిన సూచీలు శుక్రవారం ట్రేడింగ్‌లో మధ్యాహ్నం మిశ్రమంగా కదలాడాయి. మొత్తం వారం రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్2.4% , నిఫ్టీ 1.5% లాభపడ్డాయి., ఈ రోజు ట్రేడింగ్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 10 పాయింట్లు లాభపడి 33,157 వద్ద ముగియగా మరో సూచీ నిఫ్టీ 20.75 పాయింట్లు తగ్గి 10323.05 వద్ద స్థిరపడింది.

ఈ వారం మార్కెట్ మదుపర్లను మురిపించింది. సెన్సెక్స్ సోమవారం నుంచి శుక్రవారం వరకూ దాదాపుగా 770 పాయింట్లు(2.37%) బలపడింది. అదే సమయంలో నిఫ్టీ 176.50 పాయింట్లు(1.74%) పైకి ఎగబాకింది.
బీఎస్ఈలో రంగాల వారీ చూస్తే టెలికాం(5.06%), ఇంధన రంగం(1.57%), చమురు,సహజ వాయు రంగం(1.16%), బ్యాంకింగ్(0.82%) నష్టపోగా మరో వైపు హెల్త్ కేర్(1.61%), ఇండస్ట్రియల్స్(0.82%), ఆటో(0.85%) లాభపడ్డాయి.
బీఎస్ఈ 30 షేర్లలో అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ లాభపడ్డ వాటిలో ముందుండగా; భారతి ఎయిర్టెల్(4.98%), ఎస్బీఐ(3.03%), విప్రో(1.94%), రిలయన్స్(1.88%), ఎన్టీపీసీ(1.49%) నష్టపోయిన వాటిలో ముందు ఉన్నాయి.


Click it and Unblock the Notifications