జీవన కాల గరిష్టాలకు స్టాక్ మార్కెట్ సూచీలు
గురువారం అక్టోబర్ నెలకు సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనుండటంతో చాలా సేపు మార్కెట్లు స్వప్ప హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయితే మార్కెట్లు ముగిసే సరికి వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్
గురువారం అక్టోబర్ నెలకు సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనుండటంతో చాలా సేపు మార్కెట్లు స్వప్ప హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయితే మార్కెట్లు ముగిసే సరికి వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. అయితే బుధవారం లాభాల దూకుడు చూపించిన ప్రభుత్వ రంగ బ్యాంక్ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. లోహ రంగ షేర్లు భారీ లాభాలతో మెరవగా.. ఫార్మా, ఆటో రంగాలు మార్కెట్లకు బలాన్నిచ్చాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 105 పాయింట్లు పెరిగి 33,147 వద్ద నిలిచింది. నిఫ్టీ 48 పాయింట్లు పుంజుకుని 10,344 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలు కావడం విశేషం! ఎన్‌ఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం రికార్డ్ గరిష్ట స్థాయిలకు చేరాయి.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే చమురు,సహజ వాయు రంగం(2.19%), లోహ రంగం(2.07%), క్యాపిటల్ గూడ్స్(1.26%), పీఎస్‌యూ(1.26%) రంగాలు బాగా లాభపడగా కన్సూమర్ డ్యూరబుల్స్(0.78%), టెక్నాలజీ(0.09%) రంగాలు మాత్రం నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో బాగా లాభపడిన వాటిని చూస్తే సిప్లా(+ 3.18%), మారుతి(2.6%), యాక్సిస్ బ్యాంక్ (2.48%), టాటాస్టీల్ (+ 1.72%), ఎల్ అండ్ టి (+ 1.68%) ముందుండగా, మరో వైపు నష్టపోయిన వాటిలో
ఐసిఐసిఐ బ్యాంక్ (-2.08%), పవర్గ్రిడ్ (-1.65%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.25%), ఏసియన్ పెయింట్స్ (-0.96%), భారతి ఎయిర్టెల్ (-0.96%) మొదలైనవి ఉన్నాయి.


Click it and Unblock the Notifications