స్టాక్ మార్కెట్ల రికార్డు ముగింపు
సెన్సెక్స్ ఒకానొక దశలో 510 పాయింట్లు ఎగబాకి 33,117 జీవన కాల గరిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సరికి 435 పాయింట్ల లాభంతో 33,042 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 10,295 పాయింట
దేశీయ మార్కెట్లు బుధవారం దూకుడుగా చెలరేగాయి. బ్యాంకులకు మూలధన ప్రకటన, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి రూ.7 లక్షల కోట్ల కేటాయింపు వార్తలతో మార్కెట్లు ఆద్యంతం సానుకూలంగా కదలాడాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 510 పాయింట్లు ఎగబాకి 33,117 జీవన కాల గరిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సరికి 435 పాయింట్ల లాభంతో 33,042 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 10,295 పాయింట్ల వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే పీఎస్‌యూ(8.07%), బ్యాంకింగ్(4.71%), క్యాపిటల్ గూడ్స్(3.33%), మౌలిక రంగం(2.23%) లాభాల్లో పయనించగా, మరో వైపు వినియోగదారు వస్తువులు(1.31%), హెల్త్‌కేర్(1.11%), స్థిరాస్తి(0.35%) రంగాలు నష్టపోయాయి.
సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ వాటిలో ఎస్‌బీఐ(27.58%), ఐసీఐసీఐ(14.69%), ఎల్ అండ్ టీ(5.65%), యాక్సిస్ బ్ఆయంక్(4.61%), భారతీ ఎయిర్‌టెల్(2.76%) ముందుండగా మరో వైపు నష్టపోయిన వాటిలో కొటక్ బ్యాంక్(5.43%), హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్(3.79%), హెచ్‌డీఎఫ్‌సీ(2.6%), లుపిన్(2.22%), సన్‌ఫార్మా(2.1%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications