దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. ఒక పక్క ఆదాయంలో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉండగా మరో పక్క వార్షిక ఆదాయ అంచనాల్లో భారీగా కోత విధించింది.
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. ఒక పక్క ఆదాయంలో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉండగా మరో పక్క వార్షిక ఆదాయ అంచనాల్లో భారీగా కోత విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో(2017-18, క్యూ2) కంపెనీ రూ.3,726 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.3,606 కోట్లతో పోలిస్తే 3.3% వృద్ధి నమోదైంది. ఫలితాలకు సంబంధించి ముఖ్య అంశాలను చూద్దాం.

డాలర్ల ఆదాయంలో 7.3% వృద్ది
మొత్తం ఆదాయం స్వల్పంగా 1.5 శాతం మాత్రమే పెరిగింది. గతేడాది క్యూ2లో రూ.17,310 కోట్ల నుంచి ఈ క్యూ2లో రూ.17,567 కోట్లకు చేరింది. డాలర్ల రూపంలో చూస్తే లాభం 7.3% వృద్ధితో 578 మిలియన్ డాలర్లకు చేరింది. ఆదాయం 5.4% ఎగబాకి 2.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రమోటర్లతో పొసగక సీఈఓ పదవికి విశాల్ సిక్కా అకస్మాత్తుగా రాజీనామా చేసిన తర్వాత ఇవి తొలి ఫలితాలు కావడం గమనార్హం.

గత త్రైమాసికంతో పోలిస్తే
ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)తో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదికన క్యూ2లో ఇన్ఫోసిస్ నికర లాభం 6.9 శాతం పెరిగింది. ఇక ఆదాయం 2.8 శాతం వృద్ధి చెందింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ2లో ఇన్ఫీ రూ. 3,496 కోట్ల లాభాన్ని, రూ.17,630 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు.

ఆదాయ అంచనాల తగ్గింపు
ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరానికి డాలర్ల రూపంలో కంపెనీ ఆదాయ అంచనా(గైడెన్స్)లను 5.5-6.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంతక్రితం 6.5-8.5 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేయడం గమనార్హం. ఆపరేటింగ్ మార్జిన్ 23-25 శాతంగా, రూపాయి ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 3-4 శాతం మేర ఉంటుందని కంపెనీ తాజాగా అంచనా వేసింది.

కొత్త సీఈఓ కోసం
కంపెనీకి పూర్తిస్థాయిలో కొత్త సీఈఓను నియమించేందుకు అన్వేషణ ప్రక్రియ చురుగ్గానే కొనసాగుతోందని ఇన్ఫోసిస్ పేర్కొంది. వివిధ పక్షాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపింది. సిక్కా ఆకస్మిక రాజీనామా తర్వాత నీలేకనిని చైర్మన్‌గా, యూబీ ప్రవీణ్ రావును తాత్కాలిక సీఈఓ, ఎండీగా నియమించిన సంగతి తెలిసిందే.
కాగా, ప్రస్తుత తాత్కాలిక సీఈఓ ప్రవీణ్‌రావుతో పాటు, సీఎఫ్‌ఓ రంగనాథ్, బీఎఫ్‌ఎస్‌ఐ విభాగం హెడ్ మోహిత్ జోషిలను ఈ పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వి.బాలకృష్ణన్, మోహన్‌దాస్ పాయ్, అశోక్ వేమూరి, బీజీ శ్రీనివాస్‌లు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆదాయాలు-లాభాలు
జులై-సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 3.3% వృద్దితో రూ.3726 కోట్లకు చేరింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 15,567 కోట్లు.
ఒక్కో షేరుకు రూ.13 మధ్యంతర డివిడెండును ప్రకటించారు.
గతేడాది సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే నిర్వహణ లాభంలో 1.4% పెరుగుదల కనిపించింది.
మొదటి త్రైమాసికంతో పోలిస్తే 3.3% వృద్దితో రూ.4246 కోట్లుగా నిర్వహణ లాభం నమోదైంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications